సినిమా ఇండస్ట్రీ లో చాలా సార్లు ఒక సినిమా కోసం అనుకున్న నటీనటులు ఆఖరి నిముషంలో మారిపోతూ ఉంటారు.ఇలా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు జరుగుతూనే ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి సహజ నటి జయసుధకు కూడా వచ్చిందట.ఆమె మొదటి నుంచి కళా తపస్వి కె విశ్వనాధ్ గారి సినిమాల్లో తక్కువగానే కనిపించారు.
కారణం ఏంటో తెలియదు కానీ జయసుధను ఎదో ఒక సినిమా లో బుక్ చేయాలనుకున్నప్పుడల్లా ఎదో ఒక కారణం తో ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చేది.కానీ కమర్షియల్ సినిమా చేయాలనీ విశ్వనాధ్ గారు నిర్నయిన్చుకున్నప్పడు మాత్రం జయసుధ తో కొన్ని సినిమాలు చేసారు.
అందులో కాలాంతకుడు, అల్లుడు పట్టిన భారతం వంటి సినిమాలు ఉన్నాయ్.ఇక సాగర సంగమం సినిమా సమయం లో కూడా అచ్చం ఇలాంటి ఒక సంఘటనే జరిగింది.
మొదట ఈ సినిమా కు హీరోయిన్ గా జయసుధ ను పెట్టాలని ఏడిద నాగేశ్వర రావు గారు అనుకున్నారు.అనుకున్నదే తడవుగా ఆమెను సంప్రదించి కొంత మేర అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
కానీ ఆ టైం లో కమల్ హాసన్ డేట్స్ చాల బిజీ గా ఉండటం తో కొంత కాలం ఆగాల్సి వచ్చింది.

తీరా కమల్ హాసన్ ఫ్రీ అయ్యే టైం కి జయ సుధా ఎన్టీఆర్ తో ఒక సినిమా ఒప్పుకొని ఉండటం వల్ల ఆ టైం కి డేట్స్ ఇవ్వలేకపోయారు.దాంతో కె విశ్వనాధ్ గారు కొంత కాలం వేచి ఉందామని చెప్పారు కానీ మళ్లీ కమల్ హాసన్ కి అప్పుడు కుదరక పోతే ముందు ముందు మరిన్ని ప్రాజెక్ట్స్ సిద్ధం గా ఉండటం తో సినిమాను జయ సుధ కోసం ఆపలేక పోయారు.దాంతో జయసుధ స్థానం లో జయ ప్రద ను తీసుకున్నారు.

ఆ రోజు కె విశ్వనాధ్ గారు తీసుకున్న నిర్ణయమే సరైనది.ఒక వేళా జయప్రద పాత్రా లో మరే హీరోయిన్ ఊహించుకోవడం కష్టమే.అంతలా ఆమె తన అభినయం తో అందరిని మెప్పించింది.ఆలా మొత్తానికి జయసుధ ఒక అద్భుతమైన సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారు.వాస్తవానికి ఈ కథ జయసుధ ను దృష్టి లో పెట్టుకునే రాశారట.కానీ అది కుదరకుండా పోయిందని విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.







