దడ పుట్టిస్తున్న ఫోన్ నంబర్.. దీనిని చదివే ధైర్యం ఉందా?

మీరు ఇప్ప‌టివ‌ర‌కూ చాలా భయానక ప్రదేశాల గురించి విని ఉంటారు.ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి.

 Do You Have The Guts To Read This Phone Number , Phone Number , Haunted Phone N-TeluguStop.com

ఆ ప్రాంతం పేరు వినగానే వణుకు పుడుతుంది.కానీ భయపెట్టే ఫోన్ నంబర్ల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మనం ప్రపంచంలోని హాంటెడ్ ఫోన్ నంబర్‌ గురించి తెలుసుకుందాం.ఈ విషయం తెలిస్తే మీకు వ‌ణుకు పుడుతుంది.ఈ ఫోన్ నంబర్ తీసుకున్న వ్యక్తి చనిపోయాడ‌ని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌నంప్రకారం… ఈ ఫోన్ నంబ‌ర్‌ ప్రపంచంలో చాలా నీచమైన సంఖ్య, దానిని తీసుకున్న వారు మృత్యువాత ప‌డుతున్నారు.ఇది గత 20 ఏళ్లుగా కొనసాగుతోంది.

ఈ దెయ్యం మొబైల్ నంబర్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఇప్పటి వరకు ముగ్గురికి ఈ ఫోన్ నంబర్ కేటాయించగా ఆ ముగ్గురూ అత్యంత దారుణంగా మరణించారు.

ఇది తెలుసుకు్న జనం భ‌యంతో వ‌ణికిపోయారు.ఈ ఫోన్ నంబర్ బల్గేరియాకు చెందినది.

ఈ ఫోన్ నంబర్‌ను మొబిటెల్ కంపెనీ సీఈవో మొదట తీసుకున్నారు.అతని పేరు వ్లాదిమిర్ గెస్నోవ్.అతను తన కోసం కేటాయించిన‌ 0888888888 ఫోన్ నంబర్‌ను తీసుకున్నాడు.2000 సంవత్సరంలో అతను ఈ ఫోన్ నంబర్‌ను తీసుకున్నాడు.మరుసటి సంవత్సరం, వ్లాదిమిర్ క్యాన్సర్‌తో మరణించాడు.కేన్సర్‌ వల్లే చనిపోయారనే ప్రచారం సాగినా, అసలు అత‌ని మరణానికి ఫోన్‌ నంబరే కారణమని చెబుతున్నారు.ఈ ఫోన్ నంబర్ అతని జీవితానికి శత్రువుగా మారిందని బల్గేరియాలోని కొన్ని మీడియా సంస్థలు వార్తల్లో తెలిపాయి.డిమెట్రోవ్ అనే పేరుమోసిన డ్రగ్ డీలర్ ఈ నంబర్‌ను ఉపయోగించడం ప్రారంభించాడు.

ఈ నంబర్ తీసుకున్న కొద్దిసేపటికే డిమెట్రోవ్ హత్యకు గురయ్యాడు.డిమెట్రోవ్‌ను రష్యన్ మాఫియా చంపింది.

దీని తర్వాత ఈ నంబర్‌ను బల్గేరియాకు చెందిన ఒక వ్యాపారవేత్త తీసుకున్నాడు.ఆ తర్వాత 2005లో అత‌ను హత్యకు గురయ్యాడుఅతను కొకైన్ ట్రాఫికింగ్ ఆపరేషన్ నిర్వహించాడు.2005లో మూడు మరణాల తర్వాత, ఈ సంఖ్య శాశ్వతంగా నిలిపివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube