చిన్న‌ప్పుడు జామ్ బాటిల్ తెచ్చేవాడ‌ని... రాహుల్ ద్రవిడ్‌ను ఎలా ఆట‌ప‌ట్టించేవారంటే...

ఇండియ‌న్ క్రికెట్‌లో ఎంతో పేరొందిన వారిలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.ప్రస్తుత టీం ఇండియాకు కోచ్‌గా ఉన్నారు.

 How Rahul Dravid Was Teased Details, Rahul Dravid, Rahul Dravid Nick Name, Jammy-TeluguStop.com

ద్రవిడ్ మొన్న‌ జనవరి 11న తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలుచుకునే ద్రవిడ్ 164 టెస్టుల్లో 13288 పరుగులు, 344 ఓడీఐలలో 10899 పరుగులు చేశాడు.

అనేక జట్లకు మార్గనిర్దేశం చేయ‌డంతోపాటు శిక్షణ కూడా ఇచ్చాడు.అతని కెరీర్‌లో సాధించిన‌ విజయాలు అనేకం ఉన్నాయి.రాహుల్ ద్ర‌విడ్‌ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రవిడ్‌ని జామీ అనే పేరుతో కూడా పిలుస్తారు

ద్రవిడ్‌ని ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే.కానీ, అతనికి మరింత వినోదంతో కూడిన‌ మారుపేరు ఉంది .అదే జామీ.అతని తండ్రి ప్రముఖ భారతీయ జామ్ మేకర్ కిసాన్‌లో పని చేసేవారు.రాహుల్ ద్ర‌విడ్‌ క్రికెట్ ప్రాక్టీస్‌కు వెళ్లినప్పుడల్లా, ద్రవిడ్ తల్లి అతనికి జామ్ సీసాను అందజేసేది.

అందువల్ల అతని సహచరులు అతన్ని జామీ అని పిలవడం ప్రారంభించారు.ఆ తర్వాత ద్రవిడ్ కిసాన్ జామ్ కోసం ప్రకటన కూడా చేయ‌డం విశేషం.

క్రికెట్ అతని మొదటి క్రీడ కాదు

ద్రవిడ్‌ క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకోవడం మనందరికీ తెలిసిందే.అయితే క్రికెట్ శిక్ష‌ణ‌లో చేరడానికి ముందు ద్రవిడ్‌ హాకీ స్టిక్ ప‌ట్టుకున్నాడు.ద్రవిడ్ క్రికెట్ ప్రపంచంలోకి రాకముందు హాకీ ఆడాడు.అతను హాకీ గురించి చాలా సీరియస్‌గా ఉండేవాడు.జూనియర్ స్టేట్ టోర్నమెంట్‌లో తన సొంత రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు.

భార్య పుట్టినరోజు జెర్సీ నంబర్‌గా మారింది

రాహుల్ ద్రవిడ్ జెర్సీపై ఎప్పుడూ 19 నంబర్ క‌నిపించేది.ఆ నిర్దిష్ట నంబర్‌ను ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు, అది తన భార్య విజేత పెంధార్కర్ పుట్టిన తేదీ అని, దానిని గుర్తుపెట్టుకోవడం సులువుగా ఉండేందుకు అలా ఎంచుకున్నాన‌ని రాహుల్ ద్రావిడ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube