ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ సంస్కృతి( Telangana culture ) సంప్రదాయాల తో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ( Bathukamma ).

తీరక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకు నిచ్చే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ అని ఆనంద్ విద్యానికేతన్( Anand Vidyanikethan ) పాఠశాల ప్రధానోపాధ్యాయుల బిళ్ళ ఆనందం అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు .ఉపాధ్యాయినిలు ,విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు.చిన్నారులు సైతం ఆనందంగా బతుకమ్మ ఆట ఆడారు.

Bathukamma Celebrations At Anand Vidyaniketan School , Bathukamma , Anand Vidyan

ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిళ్ళ ఆనందం మాట్లాడుతూ తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు అని అన్నారు.తెలంగాణ అడపడుచులందరు బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ నుండి తొమ్మిది రోజులపాటు సద్దుల బతుకమ్మ వరకు పండుగను నిర్వహించుకుంటారు.

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ కొలటలు వేస్తూ ముందస్తు బతుకమ్మ వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ ముందస్తుగా మండల ప్రజలకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.

ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Latest Rajanna Sircilla News