ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బెంగళూరు నగరం జల దిగ్బంధం అయింది.ఒక్కరోజు కురిసిన వానకే నగరమంతా జలమయమైంది.
రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు రోడ్లపై చేరిన నీటిలో చేపలు కొట్టుకువచ్చాయి.దీంతో స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి వలల సాయంతో చేపలను పడుతున్నారు.
తాజా చేపలు కావాలంటే ఎక్కడికో వెళ్లనవసరం లేదని, బెంగళూరు రోడ్ల పైకి వస్తే చాలని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.