ఐదు వేలమందితో ఆజాద్ కా గౌరవ్ యాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్,పాల్వాయి స్రవంతి రెడ్డి,పున్న కైలాసనేత,పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదిక గౌరవ్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని.ఈనెల 13వ తేదీన నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు నిర్వహించే ఈ యాత్రలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

Azad Ka Gaurav Yatra With Five Thousand People-ఐదు వేలమంది�

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?
Advertisement

Latest Yadadri Bhuvanagiri News