దీపారాధన సమయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తున్నారా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం నిత్యం దీపారాధన చేయడం ఎంతో సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం.ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి దేవతలను నమస్కరిస్తున్నారు.

 Are You Making These Mistakes During Deeparadana , Pooja Tim, Deeparadana, Gods, Mistakes, Deeparadana Oil Deeparadana Mistakes, Ghee, Match Sticks, Deeparadna Rules, Telugu Bhakti-TeluguStop.com

అయితే ఈ దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాము.ఈ విధమైన పొరపాట్లు చేయటం వల్ల దేవతల అనుగ్రహం కలగడం ఏమో గాని వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

ఈ విధంగా ప్రతి రోజు దేవుడికి దీపం పెట్టడం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని దహించి వేసి ఆ దేవుని కృపతో జ్ఞానం పొందుతున్నామని చెప్పడమే ఈ దీపారాధన ముఖ్య ఉద్దేశం.

 Are You Making These Mistakes During Deeparadana , Pooja Tim, Deeparadana, Gods, Mistakes, Deeparadana Oil Deeparadana Mistakes, Ghee, Match Sticks, Deeparadna Rules, Telugu Bhakti-దీపారాధన సమయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తున్నారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీపారాధన చేసేటప్పుడు చాలామంది ప్రమిదల్లో వత్తులు వేసి తరువాత నూనెను పోసి దీపం వెలిగిస్తారు.

అయితే పొరపాటున ఈ విధమైనటువంటి తప్పు చేయకూడదు.ముందుగా నూనె పోసిన తరువాతే ఒత్తులు వేయాలని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా కొందరు వారంలో వారికి ఎంతో పవిత్రమైన రోజున మాత్రమే దీపపు ప్రమిదలను శుభ్రం చేసి మిగిలిన రోజులన్నీ యదావిధిగా దీపం వెలిగిస్తారు.అయితే ప్రతి రోజు దీపం వెలిగించే సమయంలో దీపపు ప్రమిదలను శుభ్రం చేసుకోవాలి.

చాలా మంది దీపం వెలిగించే సమయంలో ప్రమిద కింద ఎటువంటి ఆధారం లేకుండా దీపం వెలిగిస్తారు.

Telugu Deeparadana, Deeparadanaoil, Deeparadna, Ghee, Gods, Pooja Tim, Telugu Bhakti-Telugu Bhakthi

అయితే ఆధారం లేకుండా దీపం వెలిగించకూడదు.ఈ విధంగా దీపపు ప్రమిద కింద ఆధారం పెడితే మన జీవితంలో కూడా ఆ భగవంతుడు మనకి ఆధారం కల్పిస్తాడు.ఇకపోతే ప్రతి ఒక్కరు చేసే పెద్ద పొరపాటు ఇది దీపపు ప్రమిదలను నేరుగా అగ్గిపుల్లలతో వెలిగిస్తారు అయితే దీపం వెలిగించేటప్పుడు కొవ్వొత్తిని వెలిగించుకొని దీపారాధన చేయాలని పురోహితులు చెబుతున్నారు.

కొవ్వొత్తి తో దీపారాధన వెలిగించి అనంతరం దేవుడికి కర్పూర హారతి ఇవ్వాలి.దీపారాధనకు ముఖ్యంగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి.దీపారాధన చేసే సమయంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిపై సింధూరం దిద్దుకోవాలి.ఈ విధంగా పూజా సమయంలో తప్పులు చేయకుండా జాగ్రత్త పడి దీపారాధన చేయటం వల్ల ఆ దేవుని అనుగ్రహం మనపై కలుగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube