చైతూ కొత్త సినిమా క్రేజీ అప్డేట్.. నెక్స్ట్ అతనితోనే!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.

 Naga Chaitanya Next Movie With Shiva Nirvana, Love Story Movie, Akkineni Naga Ch-TeluguStop.com

ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు చైతూ యాక్టింగ్ ఇరగదీశాడని ప్రశంసిస్తున్నారు.శేఖర్ కమ్ముల మరొక మనసుకు హత్తుకుపోయే ప్రేమ్ కథను ప్రేక్షకులకు ఆడించాడనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, నాగ చైతన్య జంట అయితే తెర మీద కన్నుల పండుగగా ఉంది.ఇక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న చైతు ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాతో పాటు చైతు బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక దీనితో పాటు నాగార్జున బంగార్రాజు సినిమాలో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.ఇక ఇప్పుడు మరొక కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించిన చివరకు శివ నిర్వాణ పేరు వినిపిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే శివ నిర్వాణ తో మజిలీ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు చైతు.ఇక యిప్పుడు మరొకసారి రెడీ అయ్యాడు.శివ నిర్వాణ విజయ్ దేవరకొండలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.

Telugu Akkineninaga, Love Story, Mythri Makers, Naga Chaitanya, Nagachaitanya, S

ఇక ఇప్పుడు శివ నిర్వాణ, చైతు కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను సెట్ చేసినట్టు తెలుస్తుంది.శివ తాజాగా ఒక వీడియోను షేర్ చేసాడు.వైజాగ్ బీచ్ లో కూర్చుని ప్రేమ కథను రాస్తున్నట్టు తెలిపాడు.అలలు ఎంత స్వచంగా ఉంటాయో నా ప్రేమకథ కూడా అంత స్వచంగా ఉంటుందని తెలిపారు.ఇక ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్టు టాక్.మొత్తానికి చైతు కెరీర్ లవ్ స్టోరీ సినిమాతో మరో మెట్టు ఎక్కిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube