వైసీపీలోకి టీడీపీ నేత కుమారుడు.. జ‌గ‌న్‌తో భేటీ...!

టీడీపీ నుంచి జారిపోతున్న‌వారిని ఎంత‌గా ఆపాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.చంద్ర‌బాబు వ‌ల్ల కావ‌డం లేదా?  పార్టీలో నేత‌ల‌కు విశ్వాసం క‌ల్పించ‌లేక పోతున్నారా?  త‌మ‌కుపార్టీలో విలువ లేద‌ని భావించే వారి సంఖ్య పెరుగుతోందా? అంటే.తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఔన‌నే సంకేతాల‌నే ఇస్తున్నాయి.టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ, దివంగ‌త డీకే ఆదికేశ‌వుల నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్‌.తాజాగా వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు.వాస్త‌వానికి ఆదికేశ‌వుల నాయుడు స‌తీమ‌ణి స‌త్య‌ప్ర‌భ టీడీపీలో ఉన్నారు.

 Tdp Leader Son Likely To Join In Ysrcp, Jagan Mohan Reddy, Dk Adhikeshavula Naid-TeluguStop.com

చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహిత కుటుంబం కూడా కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఆమెను చంద్ర‌బాబు రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపారు.

వాస్త‌వానికి ఇక్క‌డ ఓడిపోతాన‌ని, వైసీపీకి బ‌లం ఎక్కువ‌గా ఉంద‌ని ఆమె చెప్పినా.చంద్ర‌బాబు వినిపించుకోలేదు.

దీంతో ఆమె విధిలేని ప‌రిస్థితిలో ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం, త‌ర్వాత ఓట‌మి పాల‌వ‌డం తెలిసిందే.ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఆమ‌ధ్య వీరి క‌ళాశాల‌ల‌పై సీబీఐ అధికారులు దాడులు చేసిన స‌మ‌యంలో చంద్ర‌బాబును సాయం కోరిన‌ట్టు వార్త‌లు వచ్చాయి.అయితే, ఆయ‌న అప్ప‌ట్లో మౌనం పాటించారు.

ఇక‌, అప్ప‌టి నుంచి పూర్తిగా పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

Telugu Chandra Babu, Dk Srinivas, Metjagan, Ysrcp-Telugu Political News

తాజాగా ఆదికేశ‌వుల నాయుడు కుమారుడు శ్రీనివాస్‌.సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.పైకి మాత్రం.

తన తండ్రి హయాంలో ప్రారంభించిన ‘తిరుమ‌ల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరిన‌ట్టు వార్త‌లు వ‌చ్చినా.తెర‌వెనుక సీఎంను క‌ల‌వ‌డం వైసీపీలోకి వ‌చ్చేందుకేన‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

ప్ర‌స్తుతం టీడీపీలో త‌మ‌కు ఎలాంటి గుర్తింపూ లేద‌ని.ఆయ‌న వాపోయిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, జ‌గ‌న్ కూడా డీకే కుటుంబాన్ని పార్టీలో చేర్చుకునేందుకు రెడీగానే ఉన్నారని.చెబుతున్నారు.

అయితే, టీడీపీ నేత‌లు ఈ విష‌యం తెలిసి.అలెర్ట్ అయ్యారని కొంద‌రు చెబుతున్నారు.

డీకే కుటుంబానికి చంద్ర‌బాబు ఎంతో చేశార‌ని ఇప్ప‌డు పార్టీ క‌ష్టాల్లో ఉంటే.వ‌దిలేసింది వారేన‌ని ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని వారు అంటున్నారు.

మొత్తానికి డీకే కుటుంబం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.మ‌రి పార్టీ మార్పుపై ఏం చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube