బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో సుమారు 200 పైగా సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు సత్యరాజ్( Satya Raj ).ఇలా తెలుగు తమిళ కన్నడ భాషలలో ఈయన సుమారు 200 సినిమాలలో నటించారు ఇక తెలుగులో శంఖం మిర్చి వంటి సినిమాల ద్వారా ఈయన తండ్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 Breaking Tragedy At Baahubali Kattappas House , Kattappa's House Is A Tragedy, S-TeluguStop.com

ఇలా పలు సినిమాలలో తండ్రి పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సత్యరాజ్ కి బాహుబలి( Bahubali ) సినిమా ఎంతో మంచి సక్సెస్ అందించింది.

Telugu Bahubali, Kattappa, Mother, Nathambaal, Prabhas, Satya Raj-Movie

ఈ సినిమాలో కట్టప్ప( Kattappa ) పాత్రలో సత్యరాజ్ ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సినిమా తర్వాత ఈయనకు ఎంతోమంది అభిమానులు కూడా పెరిగిపోయారు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం ఏర్పడింది .సత్య రాజ్ తల్లి నతం బాల్ ( Nathambaal ) నిన్న రాత్రి తన స్వగృహంలో మరణించారు.94 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈమె వయసు పైబడటంతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే నిన్న రాత్రి తన స్వగృహంలోనే ఈమె తుది శ్వాస విడిచారు.

Telugu Bahubali, Kattappa, Mother, Nathambaal, Prabhas, Satya Raj-Movie

ఇక సత్యరాజ్ తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం హైదరాబాదులో ఉన్నారు.అయితే తన తల్లి మరణం వార్త వినగానే ఈయన హుటాహుటిన కోయంబత్తూర్ బయలుదేరారు.ఇక సత్యరాజ్ తల్లికి ముగ్గురు సంతానం సత్యరాజ్ తనకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.

ఇక సత్యరాజ్ తల్లి నతంబాల్ కి తన కుమారుడు నటించే సినిమాలు అంటే చాలా ఇష్టమని ఆ సినిమాలన్నింటిని తాను చూసేది అంటూ ఒకానొక సమయంలో వెల్లడించారు.ఇక ఈయనకు కూడా తన తల్లి అంటే అమితమైన ప్రేమ.

అయితే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన తల్లి మరణించారన్న వార్త తెలియగానే ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఈ విషయం తెలియడంతో పలువురు సినీ సెలెబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube