యూఎస్ : మరోసారి నోరు జారిన వివేక్ రామస్వామి.. జెలెన్‌స్కీని నాజీతో పోల్చుతూ వ్యాఖ్యలు, వివాదం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్ నవంబర్ 8న మియామీలో ముగిసింది.ఈ సందర్భంగా జీవోపీ అభ్యర్ధులంతా వాడి వేడి విమర్శలతో స్టేజ్‌ను హీటెక్కించారు.

 Indian Origin Vivek Ramaswamy Calls Zelensky A Nazi , His Campaign Team Clarifie-TeluguStop.com

భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ( Vivek Ramaswamy )చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.తమకు అమెరికా మరింత సాయం చేయాలంటూ అభ్యర్ధించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వివేక్ నాజీగా పోల్చాడు.

ఉక్రెయిన్‌లో 11 ప్రతిపక్ష పార్టీలను నిషేధిస్తూ జెలెన్‌స్కీ( Zelensky ) తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై నెటిజన్లు భగ్గుమనడంతో వివేక్ రామస్వామి ప్రచార బృందం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

జెలెన్‌స్కీని నాజీ అనే ఉద్దేశం రామస్వామికి లేదని పేర్కొంది.కెనడియన్( Canadian ) చట్టసభ సభ్యులు జెలెన్‌స్కీ పర్యటన సందర్భంగా నాజీ సైన్యంలో పనిచేసిన ఉక్రెయిన్ ( Ukraine )సైనికుడిని సత్కరించిన ఎపిసోడ్‌ను రామస్వామి ప్రస్తావించారని వివేక్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ న్యూయార్క్ టైమ్స్‌తో( Tricia McLaughlin ) అన్నారు.

Telugu America, Canadian, Ukraine, Vivek Ramaswamy, Wroxhamroad, Zelensky-Telugu

ఇక ఇదే చర్చా కార్యక్రమంలో కెనడా సరిహద్దుల్లో రక్షణ గోడను నిర్మించాలని వివేక్ రామస్వామి పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.మూడు మిలియన్ల మంది అమెరికన్లను చంపడానికి పంపిన ఫెంటానిల్ గతేడాది ఉత్తర సరిహద్దుల్లో పట్టుబడిందని.అమెరికన్ల రక్షణ కోసం ఒక గోడ చాలదని, రెండు గోడలు నిర్మించాలని వివేక్ కోరారు.యూఎస్ – కెనడా సరిహద్దును సందర్శించిన ఏకైక రిపబ్లికన్ అభ్యర్ధిని తానేనని రామస్వామి వెల్లడించారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో క్యూబెక్‌లోని రోక్స్‌హామ్ రోడ్ క్రాసింగ్‌ను( Wroxham Road Crossing in Quebec ) సందర్శించిన నాటి వీడియోలను వివేక్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఫెడరల్ డేటా ప్రకారం 2022లో దాదాపు 40 వేల మంది వలసదారులు ఈ క్రాసింగ్‌ను వినియోగిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

Telugu America, Canadian, Ukraine, Vivek Ramaswamy, Wroxhamroad, Zelensky-Telugu

రిపబ్లికన్ అభ్యర్ధిగా ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి అమెరికా విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్‌పై పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ రామస్వామి.అక్రమ వలసదారులకు జన్మించిన పిల్లలకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం అనే నిబంధనను ముగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నేటికీ పెద్ద దుమారం రేగుతోంది.అక్రమ వలసదారులకు జన్మించిన సంతానానికి పుట్టుకతో అమెరికా పౌరసత్వాన్ని వర్తింపజేసే నిబంధనను ఎత్తివేసేందుకు 14వ రాజ్యాంగ సవరణ చేయాలని వివేక్ రామస్వామి పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube