బాబు బద్రత చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం !

గత కొన్ని రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం పార్టీ( TDP party ) ఆందోళనలను ఉధృతం చేస్తుంది ముఖ్యంగా ఆయనకు జైలులో భద్రత లేదని ఆయనను అంతమొందించే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ కీలక నాయకులు గత కొన్ని రోజులుగా ప్రెస్మీట్ట్లు పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు స్వయంగా చంద్రబాబు( Chandrababu naidu ) కూడా తన భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎసిబి కోర్టుకు లేఖ రాయడం చర్చనీయాంశం గా మారింది .

 Ap Politics Revolving Around Babu Safety , Chandrababu Naidu , Ap Politics,-TeluguStop.com

తనను అంతమోదించే కుట్రను వామపక్ష తీవ్రవాదులు చేస్తున్నారని ఈ దిశగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఒక గుర్తు తెలియని లేఖ కూడా వచ్చిందని అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి విచారణ చేపట్టడం లేదని ఆయన లేఖ లో పేర్కొన్నారు .భద్రత పైన తన భయాలను గాలికి వదిలేసారని నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు ఫోటోలు తీశారని ఈ ఫుటేజ్ ను పోలీసులే లీక్ చేసి నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Chandrababu, Drone, Godavari, Jana Sena, Lokesh-Telugu Political News

జైల్లో ఉన్న ఒక డ్రగ్స్ కేసు నిందితుడు పెన్ కెమెరాతో తిరుగుతున్నాడని, ఆ ఖైదీ జైలు లోపల ఫోటోలు తీస్తున్నాడని అయినా అతనిపై ఎటువంటి నియంత్రణ లేదంటూ చంద్రబాబు లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది.ఈనెల ఆరో తారీఖున జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగరవేశారని ములాఖత్ లో నన్ను కలిసిన వారి చిత్రాల కోసం డ్రోన్( Drone ) ఎగరవేసినట్టుగా భావిస్తున్నాను అన్నారు .డ్రోన్ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో పోలీసుల ఇంతవరకు గుర్తించలేదని ఇది అధికారుల నిసహాయతకు నిదర్శనమని, కొందరు గంజాయి ప్యాకెట్లను కూడా జైల్లోకి విసురుతున్నారని ఈ జైలులో ఉన్న 2000 మంది ఖైదీలలో 750 మంది డ్రగ్స్ కేసులలో నిందితులేనని ఇలాంటి ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న నాకు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోదు అంటూ ఆయన లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Chandrababu, Drone, Godavari, Jana Sena, Lokesh-Telugu Political News

అయితే కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే తెలుగుదేశం ఇలాంటి డ్రామాలు ఆడుతుంది అంటూ అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి 16 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తికి భద్రత సంబంధమైన విషయాలపై మాత్రం ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube