దాదాపు 16 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లతో అంజలి బిజీగా ఉన్నారు.ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అంజలి కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను సంపాదించుకున్నారు.
ఒకవైపు సాఫ్ట్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అంజలి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.అంజలి నటించిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచిపేరు తెచ్చిపెట్టింది.
“నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయ్ అంతే” అంటూ అంజలి చెప్పే డైలాగులు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఆ సినిమాలో అంజలి వెంకటేష్ కు జోడీగా నటించారు.
సినిమా అంతా చీరకట్టులోనే కనిపించి తన ఎక్స్ ప్రెషన్లతో అంజలి మెప్పించారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సక్సెస్ తర్వాత అంజలికి నటిగా సినిమా ఆఫర్లు సైతం పెరిగాయి.
అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాకపోవడంతో అంజలికి స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు.
అంజలి తెలుగమ్మాయి కావడం వల్లే సీత పాత్రకు బాగా న్యాయం చేయగలిగందనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తర్వాత కొన్ని సినిమాల్లో అంజలి స్పెషల్ సాంగ్స్ చేయగా ఆ సాంగ్స్ లో అంజలి నటించడం గురించి కొంతమంది నెటిజన్లు నెగటివ్ కామెంట్లు చేశారు.అయితే ఒకసారి అంజలి డెనిమ్ మరియు జీన్స్ ధరించి ఫిజియో థెరపీ కోసం ఆస్పత్రికి వెళ్లారు.
ఆ సమయంలో నర్సు అంజలితో చిరాకుగా ప్రవర్తించగా ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అంజలికి అర్థం కాలేదు.అంజలి ఆ నర్సును ఎందుకలా చిరాకు, కోపంతో ఉన్నారని అడగగా మా అత్త గారు సినిమాలోని సీత పాత్రను చూపిస్తూ ఆ అమ్మాయి చీరకట్టులో పూలు పెట్టుకుని పొడవైన జడతో ఎంతో బాగుందని అన్నారని ఇప్పుడు మా అత్తగారిని పిలిచి మిమ్మల్ని చూపించాలని అనుకుంటున్నానని నర్సు చెప్పుకొచ్చారు.ఆ మాటలు విని అవాక్కవడం అంజలి వంతైంది.ఒక పాత్ర ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపుతుందో ఆ సమయంలో అంజలికి అర్థమైంది.