అమీ తుమీ మూవీ రివ్యూ

చిత్రం : అమీ తుమీ

 Ami Thumi Movie Review-TeluguStop.com

బ్యానర్ : గ్రీన్ టీ ప్రొడక్షన్స్

దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : కేసి నరసింహరావు

సంగీతం : మణిశర్మ

విడుదల తేది : జూన్ 9, 2017

నటీనటులు – అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిషోర్, అదితి, ఇష తదితరులు

మోహన్ కృష్ణ ఇంద్రగంటి – అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అష్టాచమ్మా ఎంతపెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.ఇంత పెద్ద గ్యాప్ తరువాత మళ్ళీ వీరిద్దరు మనల్ని నవ్వించడానికి చేసిన సినిమా ఆమీతూమి.

అయితే అవసరాల ఒక్కడే కాదు, తోడుగా అడవి శేష్, వెన్నల కిషోర్ కూడా ఉన్నారు.మరి ఈ సినిమా ప్రేక్షకులని నవ్వించగలదో లేదో చూద్దాం.

కథలోకి వెళితే :

అనంత్ (అడవి శేష్) ఇషతో ప్రేమలో ఉంటాడు.ఈ విషయం అమ్మాయి తండ్రి గంగాధర్ రావు (తనికెళ్ళ భరణి) కి నచ్చదు.

మరోవైపు గంగాధర్ కొడుకు (శ్రీనివాస్ అవసరాల) తన శతృవు కూతురితో (అదితి) ప్రేమలో ఉంటాడు.ఈ రెండు ఎఫైర్స్ గంగాధర్ కి నచ్చవు

ఈ జంటలో మధ్యలోకి వస్తాడు శ్రీచిలిపి (వెన్నెల కిషోర్).

అక్కడినుంచి వీరి సమస్యలు పెరిగిపోతాయి.ఆ సమస్యలు, గందరగోళం చివరనా, రెండు జంటలు ఒక్కటయ్యాయా లేదా అనేది మిగితా కథ.

నటీనటుల నటన :

వెన్నెల కిషోర్ .ఇద్దరు హీరోలకన్నా ముందుగా కిషోర్ గురించే మాట్లాడుకోవాలి ఇక్కడ.ఎందుకంటే ఈ సినిమా బరువుని ఎక్కువగా మోసింది తనే కాబట్టి.పచ్చిగా చెప్పాలంటే కిషోర్ లేకపోయినా, కిషోర్ కి బదులు ఆ పాత్ర ఇంకెవరు చేసినా ఈ సినిమా తేలిపోయేది.

కిషోర్ అద్యంతం అలరించాడు.అవసరాల శ్రీనివాస్ లో టిపికల్ టచ్ ఉన్నా, తన స్టయిల్ కి సరిపోయే రైటింగ్ కి కరువైంది.

అయినా, ఫర్వేలేదనిపించాడు.అడవి శేష్ కూడా అంతే.

స్లాప్ స్టిక్ స్టయిల్ కామెడి కాబట్టి మనవారు ఈ పాత్రలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.ఇష, అదితి .ఇద్దరు బానే చేసారు.తనికెళ్ళ భరణి ఇంద్రగంటి సినిమాల్లో ఎప్పటిలాగే కథలో ఓ భాగంగా ఉంది.

టెక్నికల్ టాక్ :

మణిశర్మ జానర్ సినిమా కాదు ఇది.అయినా మెలోడి బ్రహ్మ తనవంతు ప్రయత్నలు చేసారు.కాని కుదర్లేదు.మ్యూజిక్ ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి.సినిమాటోగ్రాఫి ఫర్వాలేదు.ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది.

ఇంట్రడక్షన్ సీన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సింది.ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదు.

విశ్లేషణ :

అమీతుమి స్టార్ట్ సరిగా లేకపోయినా, మెల్లిగా పుంజుకుంటుంది.క్యారక్టర్స్ ఒక్కోసారి కొంచెం లౌడ్ గా ఉంటారు.

స్లాప్ స్టిక్ కామెడి లో ఫర్వాలేదు.కాని ఇలాంటి సినిమాలు మనదగ్గర చాలా తక్కువ కదా.రైటింగ్ కూడా అంత బలమైనది కాదు.అష్టచమ్మకి, దీనికి అదే తేడా.

ఇక మరో తెడా చెప్పాలంటే అది వెన్నెలకిషోర్.ఈ సినిమాకి నిస్సందేహంగా హీరో కిషోరే.

తన టైమింగ్, తన క్యారక్టర్ మీదే లాగించేసారు
అర్బన్ ఆడియెన్స్ కి ఈ సినిమా నచ్చొచ్చు.స్లాప్ స్టిక్ కామెడి నచ్చేవరికి టైమ్ పాస్ సినిమా.

కాని బి,సి సెంటర్స్ ఆడియెన్స్ దీనికి కనెక్ట్ అవడం కష్టమైన విషయమే.ఒక్కమాటలో చెప్పాలంటే, ఓసారి థియేటర్ కి వెళ్ళి కొంచెం నవ్వుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

* వెన్నెల కిషోర్
* మోహన్ కృష్ణ టేకింగ్
* నరేషన్
* క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్ :

* క్యారక్టర్స్ ఇంట్రోడక్షన్
* హీరోలు తేలిపోవడం
* మ్యూజిక్

చివరగా :

కొన్ని నవ్వులు

తెలుగు స్టాప్ రేటింగ్ : 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube