టీడీపీ తో పొత్తు ! ఆ కమిటీని ప్రకటించబోతున్న పవన్ 

తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan )మంచి ఉత్సాహంగా ఉన్నారు.ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పొత్తు బంధాన్ని మరింత పటిష్టం చేసుకుని వైసిపికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేపట్టే విధంగా పవన్ ప్రణాళికలు రచిస్తున్నారు.

 Alliance With Tdp! Pawan Is Going To Announce That Committee , Janasena , Nara-TeluguStop.com

ఇక టిడిపి జనసేన( JanaSena ) పొత్తుపై రెండు పార్టీల నేతలలోను భిన్న అభిప్రాయాలు ఉండడం, జనసేన లోని టిడిపి పొత్తును వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉండడంతో, పవన్ ఇప్పటికే వారందరికీ క్లారిటీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన అధికారంలోకి వస్తుందని, తనపై నమ్మకం ఉంచాలని టిడిపి విషయంలో ఎవరు ఎటువంటి కామెంట్స్ చేయవద్దని , జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే మన లక్ష్యమని పవన్ ప్రకటించారు.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pavan Kalyan, Tdpjanasena, Telugudesam

ఇక టిడిపితో పొత్తు ను మరింత బలపరుచుకునెందుకు ఈ  నెలలోనే రెండు పార్టీలు కలిసి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.అలాగే ఈ కమిటీ సభ్యుల నియామకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా దృష్టి సారించారు.ఈ మేరకు జనసేన,  టిడిపిలోని సీనియర్ లేతలతోనూ ఈ విషయంపై చర్చించారు.జనసేన సమన్వయ బాధ్యతలను ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar )కు అప్పగించారు.

అలాగే తెలంగాణ నుంచి ఓ సభ్యుడిని నియమించాలనే ఆలోచనతో పవన్ ఉన్నారు.త్వరలోనే టిడిపి తరఫున సభ్యుల నియామకం జరగబోతోంది.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pavan Kalyan, Tdpjanasena, Telugudesam

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత చంద్రబాబుతో మూలాఖత్ అయి టిడిపి సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది .రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయిన తర్వాత  , ఈ నెలలోనే సమావేశం జరగబోతోంది.ఇక ఆ తరువాత నుంచి పూర్తిస్థాయిలో రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యాచరణను రూపొందించుకుని జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు .ఈ విషయంలో పవన్ మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube