నల్లగొండ జిల్లా:జిల్లాలోనే 21 గిరిజన పంచాయతీలు కలిగి,మొత్తం 34 గ్రామ పంచాయతీలతో అతిపెద్ద నూతన మండలంగా 2016 లో తిరుమలగిరి (సాగర్)( Thirumalagiri (Sagar) ) మండలం ఆవిర్భవించింది.మండలం ఏర్పడి 7 ఏళ్లు అవుతున్నా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక, ఎక్కడ ఏ ఆఫిస్ ఉందో తెలియక మండల ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సరైన సౌకర్యం లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
మండల అగ్రికల్చర్ ఆఫీస్ రైతు వేదికలో,పోలీస్ స్టేషన్ మార్కెట్ యార్డ్ లో,ఎంపీడీవో కార్యాలయం పాత సింగిల్విండో భవనంలో ఉండగా,తాహాసిల్దార్,వెలుగు ఆఫీసులు,ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, కస్తూర్బా బాలికల పాఠశాల( Kasturba Gandhi Balika Vidyalaya ) అద్దె భవనాలల్లో కొనసాగుతున్నాయి.ప్రస్తుతం కస్తూర్భా పాఠశాల భవనం నిర్మాణం కొనసాగుతుంది.
కొత్త మండలాలు ఏర్పాటు చేసి పాలనపై పట్టింపు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు( Government offices ) సొంత భవనాలు లేక పాలన పడకేసిందని,స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు,ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇంత పెద్ద మండల కేంద్రంలో పక్కా భవనాల మంజూరు చేసేదెప్పుడు?నిర్మాణాలు జరిగేదెప్పుడు?ప్రజల కష్టాలు తొలగేదెప్పడో? పాలకులకే తెలియాలి మరి