ఆర్ఆర్ఆర్‌లో ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అంటోన్న బాలీవుడ్ హీరో!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తు్న్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ జరుపుకుంటోంది.ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

 Ajay Devgan Not Charging For Rrr-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమాను పాన్ ఇండియాను రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తు్న్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు.కాగా అజయ్ దేవ్గన్ ఇటీవల చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను అజయ్ దేవ్గన్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.

రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను హిందీలో రిలీజ్ చేసినప్పడు అజయ్ దేవ్గన్ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

అప్పటినుండే రాజమౌళితో మంచి స్నేహం కలిగిన అజయ్ దేవ్గన్, ఆర్ఆర్ఆర్‌లో నటించాల్సిందిగా జక్కన్న కోరడంతో వెంటనే ఒప్పుకున్నాడట.అయితే ఇది కేమియో తరహా పాత్ర కావడంతో అజయ్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా చేసేందుకు ఒప్పుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube