ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తాను నిరూపించుకున్న సత్యదేవ్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ను ప్రారంభించిన సత్యదేవ్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు సత్యదేవ్.

 Actor Satyadev Nationalwide Recognition With Ramsetu Movie Details, Actor Sathya-TeluguStop.com

హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించాడు సత్యదేవ్.ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం రామ్ సేతు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు.ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు సత్యదేవ్.ఇటీవల అక్టోబర్ 25వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులో అక్షయ్ కుమార్ అద్భుతమైన రామ్ సేతు కట్టడం నాశనం కాకుండా కాపాడే ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించారు.కాగా అక్షయ్‌ తో పాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా,సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Telugu Sathyadev, Akshay Kumar, Bollyood, God, Satya Dev, Ramsetu, Satyadev-Movi

ఈ సినిమాలో ఇప్పటివరకు సత్యదేవ్ నటించని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.కాగా పలువురు ఈ సినిమాను చూసి నటుడు సత్యదేవ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాలలో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్.

తాజాగా బాలీవుడ్ లో విడుదల అయిన రామ్ సేతు సినిమాతో అక్కడ కూడా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube