మంత్రి రోజాపై నాగబాబు వైరల్ కామెంట్స్.. ర్యాంకు దిగజారిపోతుందంటూ?

తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పలు వాక్యాలు చేసిన విషయం తెలిసిందే.అయితే రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

 Actor Nagababu Fire On Ap Tourism Minister Roja Details, Nagababu, Minister Roja-TeluguStop.com

తాజాగా రోజా ఏకంగా మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురిని టార్గెట్ చేశారు.ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు.

కాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కౌంటర్ ఇచ్చాడు.

రోజా.

బారతదేశపు రాష్ట్రాల పర్యాటక స్థానాల ర్యాంకింగ్‌లో 20 ప్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానంలో ఉందని, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్ ఉన్నాయన్నారు.బాధ్యతలు మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడితే అతి త్వరలో పదవి దిగిపోయే లోగా రాష్ట్రాన్ని 20వ స్థానానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని విమర్శించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ పై ఆధారపడి వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారన్నారు.కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టికొట్టుకుపోయాయని, పిచ్చపిచ్చగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరీ దిగజారిపోతుందని హితవు పలికారు నాగబాబు.

Telugu Ap Tourism, Chiranjeevi, Brothers, Roja, Nagababu, Nagababu Roja, Pawan K

అయితే మొదట పర్యాటక శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు నువ్వు తెలుసుకోవాలని, పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, పర్యాటక శాఖను ఎలా అభివవృద్ధి చేయాలో తెలుసుకోవాలని తెలిపారు.రోజా ఇన్ని రోజులు చిరు, పవన్‌ కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడినా తాను రియాక్ట్ అవ్వలేదంటే ఒకటే ఒక కారణమని, రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదన్నారు.చూస్తా చూస్తా ఎవరూ మున్సిపాల్టీ కుప్పతొట్టిని గెలకరని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ మంత్రి రోజాపై నాగబాబు ఫైర్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube