వరకట్నపు హత్య కేసులో నిందుతునికి 7 సంవత్సరాల జైలు శిక్ష,30,000/- రూపాయల జరిమానా..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వరకట్నపు హత్య కేసులో నిందుతునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 30,000/-రూపాయలు జరిమాన విధిస్తు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సేషన్ జడ్జ్ ఎన్.

ప్రేమలత బుధవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాల మేరకు చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఎక్కల దేవయ్య కూతురు అయిన రేవతి అలియాస్ శిరీష 2017 సంవత్సరంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన కంటే నరేష్ ,తండ్రి దేవయ్య వయసు 30 సంవత్సరాలు, అనే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేశారు.పెళ్లి సమయంలో అత్తింటి వారి కోరిక మేరకు పది లక్షల 50 వేల రూపాయలతో పాటు 11 తులాల బంగారం మోటార్ సైకిల్ కొరకు 70 వేల రూపాయలు ఇతర లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేయగా, ఒక సంవత్సరం వరకు శిరీష, నరేష్ కలసి ఉండగా వారికి ఒక ఆడపిల్ల జన్మించింది.

Accused Sentenced To 7 Years Imprisonment Rs 30000 Fine In Dowry Murder Case, Ac

కంటే నరేష్ తల్లిదండ్రులు, ఆడపడుచులు అదనపు కట్నం, రెండు తులాల బంగారం, గొర్రెలు మరియు ఒక ప్లాట్ ఇవ్వాలని వేధింపులు గురి చేయగా రెండుసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిపి కంటే నరేష్, వారి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పి నాలుగు లక్షల రూపాయలు,11 మేకలు అదనంగా ఇచ్చి, ఫ్లాట్ కూడా త్వరలో రిజిస్ట్రేషన్ నరేష్ పేరిట చేస్తానని చెప్పి తేదీ 19 మార్చి 2021 రోజున ఉదయం తిరిగి అతని గ్రామానికి తిరిగి వెళ్ళగా అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన కూతురు ఉరి వేసుకొని చనిపోయిందని తెలువగా శిరీష తండ్రి దేవయ్య తన కూతురి భర్త అత్తా మామ ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి తన బిడ్డ మరణానికి కారణం ఐనరు అనికొనరావుపేట్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి అప్పటి డిఎస్పి చంద్రకాంత్ కంటే నరేష్ అతని తండ్రి తల్లి ఆడబిడ్డలను రిమాండ్ కి తరలించడం జరిగింది.అప్పటి కేసు విచారణ అధికారి అయిన డిఎస్పీ చంద్రకాంత్ కోర్టులో చార్జిషీట్ దాకాలు చేయగా అప్పటి కోర్టు మానిటరింగ్ ఎస్సై శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ మోహన్, సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ నరేందర్,లతీఫ్ లు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా స్పెషల్ పిపి నర్సింగరావు కేసును వాదించగా కేసు పూర్వపరాలను పరిశీలించిన జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్ ప్రేమలత నేరం రుజువు కావడంతో నిందితుడైన కంటె నరేష్ కు ఏడు సంవత్సరాల కఠిన కారగార శిక్షతోపాటు 30,000/- రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

కస్టమర్‌లా వచ్చింది.. అందరి కళ్లుగప్పి చెప్పులు కొట్టేసింది.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే!
Advertisement

Latest Rajanna Sircilla News