సాయిభవ్య కంపెనీ మాయాజాలం

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతులు సూర్యాపేటకు చెందిన సాయిరామ్ సీడ్స్ ఎరువుల షాపులో సాయి భవ్య కంపెనీకీ చెందిన సన్నరకం చింట్లు వరి విత్తనాలను కొనుగోలు చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారు.

సన్నరకం చింట్లు విత్తనాల్లో ఆర్ఎన్ఆర్ దొడ్డు రకం విత్తనాలు కలవడంతో దొడ్డు రకం ముందుగా కోతకు వచ్చాయని,సన్నరకం ఆలస్యంగా వస్తుందని,దీని కారణంగా పంట దిగుబడికి ఇబ్బంది పడుతున్నారు.

ఇదే విషయమై షాపు యజమానికి సమాచారం ఇవ్వగా వారు సాయిభవ్య కంపెనీ వారికి తెలపగా కంపెనీ ప్రతినిధులు వచ్చి పొలాన్ని పరిశీలించి విషయాన్ని కంపెనీ పై అధికారులకు తెలియజేస్తామని చెప్పి వెళ్లిపోయారు.తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు.

శనివారం బాధిత రైతు ఏర్పుల సైదులు మరో నలుగురు రైతులు మీడియాను ఆశ్రయించగా సాయిభవ్య కంపెనీ అధికారులతో మాట్లాడగా వారి నుంచి నిర్లక్ష్యంపు సమాధానం రావడంతో మండల వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయగా ఆ శాఖా అధికారి వచ్చి పంటను పరిశీలించి సన్నరకాల్లో దొడ్డు రకం విత్తనాలు కలిసినట్లు నిర్ధారించారు.విత్తనాలను విక్రయించిన సాయిభవ్య ఎరువుల కంపెనీపై చర్యలు తీసుకోనీ నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరారు.

కందగట్లకు చెందిన రైతు సైదులు వేసిన వరిసాగులో కల్తీ విత్తనాలు వచ్చిన మాట వాస్తవమేనని ఏఈఓ రాచకొండ శివ కుమార్ అన్నారు.పొలాన్ని పరిశీలించి వివరాలను పై తాధికారులకు అందజేశామని,పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకున్న బిగ్ బాస్ 8 ఫినాలే... నాగార్జున పోస్ట్ వైరల్!

Latest Suryapet News