కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Rahul Gandhi )పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.భారత్ న్యాయ్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మోదీ( Narendra Modi ) కౌంటర్ ఇచ్చారు.
శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోందన్నారు.అయితే శక్తిని నాశనం చేయడం ఎవరి వల్ల కాదని చెప్పారు.
దేశం అంతా ఆదరించే శక్తిని నాశనం చేస్తామనడం ఏంటన్న ప్రధాని మోదీ శక్తిని నాశనం చేస్తానని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు.శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలిసిపోతుందని తెలిపారు.







