గుర్రంపోడు మండలంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం కొండాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

గుర్రంపోడు ఎస్సై పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.

తేనెపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కృష్ణయ్య (40) మతిస్థిమితం లేకుండా ఈ ప్రాంతంలో తిరుగుతుంటాడు.కృష్ణయ్య అతని అన్న బుచ్చయ్య దగ్గర ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

A Person Died After Being Hit By An Unknown Vehicle In Gurrampodu Mandal, Nalgon

శుక్రవారం అర్ధరాత్రి కొండాపురం గ్రామంలో రోడ్డుపై తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి వివాహం కాలేదు.

మృతుని అన్న బొడ్డుపల్లి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News