సోషల్ మీడియా( Social media ) నేడు మనిషిని శాసిస్తోందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే దాదాపుగా మన దేశ సగటు యువత రోజుకి నాలుగైదు గంటలు సోషల్ మీడియాలో కాపురం చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఎన్నో రకాల వీడియోలు ఇక్కడ వైరల్ అవుతూ వున్నాయి.అందులో ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలను జనాలు బాగా చూస్తూ వుంటారు.
అయితే జంతువులు ఎంత భయంకరమో ఇక్కడ తెలియజేయాల్సిన అవసరం లేదు.అవి బయటకి చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపించినా.
లోపల మాత్రం డేంజర్.
అందలోనూ మొసళ్లను( Crocodile ) గురించి ఇక చెప్పేదేముంది.అవి చనిపోయినట్లుగా నేలపై పడుకుని నిశ్శబ్దంగా వున్నట్టే ఉంటాయి.కానీ అవి చాలా భయంకరమైన సరీసృపాలు.
వాటి కళ్ళకు చిక్కన జీవి బతికి బట్టకట్టడం వుండదు.మనం కొన్ని వీడియోల్లో చూస్తుంటాం.
సింహాలు, అడవి దున్నలు నీరు తాగడానికి వచ్చినప్పుడు నీళ్లలో నుంచి నెమ్మదిగా వచ్చి పట్టేస్తూ వుంటాయి.ఇక దాని చెర నుంచి తప్పించుకోవడమంటే చాలా కష్టమే.
అలాంటిది మనుషులు వాటి ముందుకు వెళ్లి నిలబడితే ఇంకేముంది గోవిందా.గోవిందా.
అయితే ఇక్కడ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి దాని ముందుకు వెళ్లి ధైర్యంగా నిలబడి మరీ దానితో ఆటలు ఆడుకున్నాడు.కాగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోని ఒకసారి మనం గమనించినట్లైతే, ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను( Meat ) తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.అది కూడా తన నోటితో అందుకోవడానికి కుస్తీ చేస్తోంది.ఈ నేపధ్యంలో ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా వుండడం మనం చాలా స్పస్టంగా చూడవచ్చు.నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది.ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు.
కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను మొసలి నోటిలో పెట్టి దాన్ని సముదాయిస్తాడు.ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ కాగా ఇప్పటివరకు దానిని అనేకమంది చూడసాగారు.