పవన్ ఇంటి ముందు ధర్నా చేస్తాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఈ పేరు వెనుక ఎన్నో రికార్డులు, మంచి చిత్రాలు, కిక్కెక్కించే మ్యానరిజమ్స్ ఉన్నాయి.

 Bobby Would Protest If Pawan Kalyan Quits Cinema-TeluguStop.com

తొలిప్రేమతో స్టార్ స్టేటస్ పొంది, ఖుషితో అగ్రహీరోగా మారి, దాదాపు దశాబ్దకాలం ఫామ్ కోల్పోయాడు పవన్.మధ్యలో జల్సా హిట్ అయినా, పవన్ అభిమానులు ఆశించే రికార్డులేవి రాలేదు.

ఎప్పడైతే గబ్బర్ సింగ్ వచ్చొందో, ఇండస్ట్రీ లెక్కలే మార్చేసాడు పవన్.అందరిచేత నెం.1 అనిపించుకున్న మహేష్ బాబుని, నెం.1 సింహాసం మీద కూర్చోకుండా అడ్డుకున్నాడు.ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ బిజినెస్ తో మహేష్ కి పెద్ద సవాలు విసిరాడు.ఈ సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణే నెం.1 అని ఒప్పుకోక తప్పదేమో

ఇంత భికరమైన ఫామ్ లో ఉండి, సినిమాల్లోంచి త్వరలోనే తప్పుకుంటానని ప్రకటించాడు పవన్.పవన్ అభిమానులకి పెద్ద షాక్ ఇది.సక్సెస్ లో ఉన్నప్పుడు ఇలా వదిలేయడం వారికి ఇష్టం లేదు.సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాలు వదలొద్దని పవన్ కి సూచించడం చూశాం

వీళ్లలంతా ఇలా బాధపడుతోంటే, పవన్ ని సినిమాలు వదలనిచ్చే ప్రసక్తే లేదు అంటున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి.

పవన్ సినిమాలు మానేస్తే పవన్ ఇంటిముందు ధర్నా చేస్తాడట.వినడానికి వింతగా ఉంది కదూ!

పవన్ సినిమాలు మానేస్తే నిజంగానే అభిమానులు ధర్నాలు చేస్తారేమో.పవన్ కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube