యువ హీరో వరుణ్ సందేశ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని వార్తలు వచ్చాయి గత వారం.అయితే వరుణ్ పెళ్లాడబోయేది ఒక టాప్ హీరోయిన్ అని గాలి వార్తలు వినిపించాయి.
కెరీర్ ఏమాత్రం ఆసక్తికరంగా లేని వరుణ్ సందేశ్ ని టాప్ హీరోయిన్ ఎలా పెళ్ళాడుతుంది విడ్డూరం కాకపోతే !
ఇంతకీ వరుణ్ సందేశ్ ని పడేసిన ఆ భామ ఎవరు ? వరుణ్ పెళ్లాడబోయే ఆ అందగత్తె ఎవరు ? రాఘవేంద్ర రావు ఝుమ్మంది నాదం సినిమా గుర్తుంది కదా .అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది .పేరు వితిక శేరు .అడపాదడపా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కుడా చేసింది.
వరుణ్ సందేశ్, వితిక కలిసి పడ్డానండి ప్రేమలో మరి అనే చిత్రంలో నటించారు.సినిమా ఫ్లాప్ అయినా, వీళ్ళ లవ్ స్టోరి సక్సెస్ అయింది.ఆ చిత్రం యొక్క సెట్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.సిని వర్గాల సమాచారం మేరకు ఇద్దరు తమ తమ పెద్దల్ని ఒప్పించారు.
త్వరలో ఇరు కుటుంబాలు కలిసి వివాహ తేదిని ప్రకటిస్తాయి.