ఆయన్ని పంపించేస్తారా!!

నాయకుడు అనే వాడు ఎప్పుడైనా సరైన వాడు అయ్యి ఉండాలి, అలా కాక అసమర్ధులను అందలం ఎక్కిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది.విషయం ఏమిటంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏర్పడిన తోలి ప్రభుత్వం తెరాసాది.

 Kcr Angry On Deputy Cm Rajaiah-TeluguStop.com

అయితే కెసీఅర్ సారూ గత ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ నేతగా ఉన్న రాజయ్యను పార్టీలోకి పిలిచి, గులాబి కండువా కప్పేసి, దళితునికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న హామీని తుంగలో తొక్కిన పాపం కాస్తయినా తగ్గించుకునే పధకంలో రాజయ్యను ఉపముఖ్యమంత్రిగా చేసేసాడు.ఇంతవరకు బాగానే ఉంది అసలు విషయమే ఇప్పుడు ముంచుకొస్తుంది…ఇప్పటివరకూ కేసీఆర్ పాలనపై ఎన్ని విమర్సలు వచ్చినా.

అవినీతి ఆరోపణలు మాత్రం పెద్దగా రాలేదు.అలాంటిది.

ఒక్క రాజయ్య చూస్తున్న శాఖలపైనే అవినీతి ఆరోపణలు విపరీతంగా వస్తూ ఉన్నాయి.ఇప్పటికే.

వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు వైద్యుల నియామకాల్లో పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి తొలి రిజిష్ట్రార్‌ నియామకం విషయంలోనూ రాజయ్య అంత శ్రద్దపెట్టలేదని విమర్శలు ఉన్నాయి.

ప్రతిష్టాత్మకమైన ఈ పోస్టుకు వివాదాస్పద అధికారిని నియమించడంపైనా కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నాడని సమాచారం.ఇక మరో పక్క స్వైన్ ఫ్లూ విరుచుకుపడటం కూడా రాజయ్య పని తీరు పై సర్వత్రా విమర్సలకు దారి తీస్తుంది.

ఇక వీటన్నింటిపైనా విసిగిపోయిన కెసీఅర్ రాజయ్యను ఆ పదవి నుంచే తప్పించే పనిలో ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube