తాజాగా ఒక అభిమాని తల్లి తనకు ఎన్టీఆర్( NTR ) ఇచ్చిన మాట తప్పారు.ఇంతవరకు తనకు ఎటువంటి సహాయం చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అసలేం పెరిగింది అంటే.జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.
మొన్న ఆ మధ్య వరకు కౌశిక్ ( Kaushik )పేరు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో జరగ వైరల్ అయ్యాయి. దేవర సినిమా( Devara movie ) చూసి చనిపోవాలని ఉంది అదే తన చివరి కోరిక అంటూ అప్పట్లో అతను చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇక ఆ వీడియో కాస్త ఎన్టీఆర్ వరకు చేరడంతో చావు బతుకుల మధ్య ఉన్న కౌశిక్ ని ఆదుకుంటాను అంటూ హామీ ఇచ్చారు ఎన్టీఆర్.ఈ మేరకు కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడి అతనికి గుండె ధైర్యం చెప్పారు.అయితే అప్పుడు మాట్లాడిన తారక్ ఇప్పటివరకు తనకు ఎలాంటి సహాయం చేయలేదని, మాకు ఎలాంటి సహాయం అందలేదు తన కొడుకును కాపాడాలని కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చింది.ఈ మేరకు తాజాగా ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గరి నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు.ఆయన అభిమానులు మాత్రం రూ.2.5 లక్షలు ఇచ్చారు.
సీఎం సహాయక నిధి ( CM Relief Fund )నుంచి రూ.11 లక్షలు, టీటీడి నుంచి రూ.40 లక్షలు రాగా, ఈ డబ్బుతో అతడికి ఆపరేషన్ చేయించాము.అయితే ఇంకా రూ.20 లక్షలు ఇస్తేనే నా కొడుకును డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు.సహాయం చేస్తానని మాట ఇచ్చిన ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మరి ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే కౌశిక్ కి కావాల్సిన సహాయం చేస్తారో లేదో చూడాలి మరి.