అంటార్కిటికా మంచు ఖండంలో (icy continent of Antarctica)ఒక పెంగ్విన్‌కు, మనుషులకు మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.సియెరా యబారా అనే ఇన్స్టాగ్రామ్(Instagram) యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది, అంతే క్యూట్‌గా ఉంది ఆ పెంగ్విన్ ప్రవర్తన.
లక్షలాది మంది ఈ వీడియోను చూసి ఫిదా అయిపోయారు.
అసలు ఏం జరిగిందంటే, ఒక మంచు దారిలో ఒక జంట నడుచుకుంటూ వెళ్తున్నారు.
అదే సమయంలో ఒక చిన్న పెంగ్విన్ (Penguin)కూడా అటువైపు వెళ్లాలనుకుంది.కానీ ఆ జంట అడ్డుగా ఉండటంతో, ఆ పెంగ్విన్ కాసేపు ఆగిపోయింది.
తోసుకుంటూ వెళ్లకుండా, చాలా మర్యాదగా వాళ్లు పక్కకు జరిగే వరకు ఓపికగా వెయిట్ చేసింది.వాళ్లు దారి ఇవ్వగానే, ఠీవిగా నడుచుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయింది.
దీన్ని చూసిన నెటిజన్లు “ఎంత మర్యాద గల పెంగ్విన్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సియెరా యబారా (Sierra Ybarra)ఈ వీడియోకి “క్షమించండి అని చెప్పడానికి భయపడితే ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది” అని ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
క్వార్క్ ఎక్స్పెడిషన్స్తో(Quark Expeditions) కలిసి అంటార్కిటికా వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశానని, అక్కడ వన్యప్రాణుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని ఆమె చెప్పారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.కేవలం రెండు రోజుల్లోనే 125 మిలియన్ల వ్యూస్, మిలియన్ లైక్స్‌తో ఇంటర్నెట్ను షేక్ చేసింది.పెంగ్విన్ ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.“పెంగ్విన్లు (Penguins)ఇంత మర్యాదగా ఉంటాయని ఎవరికి తెలుసు?” అని వీడియోలో ఒక టెక్స్ట్ కనిపించింది, ఇక నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోయారు.ఒక యూజర్ చమత్కారంగా “అవును మరి, అందుకే కదా అవి చిన్న టక్సీడోలు వేసుకుంటాయి? అవి చాలా మర్యాద గల జెంటిల్-పెంగ్విన్లు” అని రిప్లై ఇచ్చాడు.
ఇంకా చాలా మంది చాలా ఫన్నీగా కామెంట్లు పెట్టారు.ఒక నెటిజన్ అయితే “మానవుల్లో 98% మంది కంటే ఈ పెంగ్విన్‌కి ఎక్కువ మర్యాద ఉంది” అని రాసుకొచ్చాడు.మరొకరు జోక్ చేస్తూ “నా ఫోన్ బ్యాటరీ అయిపోయే వరకు ఈ వీడియో చూస్తూనే ఉంటాను” అని కామెంట్ చేశాడు.
ఈ క్యూట్ వీడియో పెంగ్విన్ అందమైన, మర్యాదపూర్వక స్వభావాన్ని చూపించడమే కాకుండా, జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను కూడా గుర్తు చేసింది.నిజంగానే, ఈ మర్యాద గల పెంగ్విన్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది.