బ్యాంక్ లో రూ.15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ.. 500 మంది ఖాతాదారులకు షాక్

తెలంగాణ రాష్ట్రములోని వరంగల్‌లో( Warangal ) భారీ దోపిడీ తాజాగా వెలుగులోకి వచ్చింది.జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( SBI ) శాఖలో సోమవారం అర్ధరాత్రి దుండగులు సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలను( Gold Ornaments ) దోచుకెళ్లారు.

 Massive Theft At Warangal Sbi Bank 15crores Worth Gold Ornaments Robbed Details,-TeluguStop.com

బ్యాంకు సెక్యూరిటీ లాకర్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు దాదాపు 500 మంది ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేశారు.దొంగలు( Thieves ) చోరీకి పాల్పడిన సమయంలో బ్యాంకు సెక్యూరిటీ గార్డు లేడని సమాచారం.

ఎవరికీ ఆధారాలు లభించలేదు.ముందుగా అలారం వైర్లను కట్ చేసి, ఆ తర్వాత కిటికీలో ఉన్న ఐరన్ గ్రిల్ ను కట్ చేశారు.

Telugu Bank Robbery, Gold Robbed, Gold Robbery, Massive Theft, Bank India, Telan

ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించి సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి అందులోని హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకెళ్లారు.గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకులోని మూడు లాకర్లలోకి చొరబడిన దొంగలు అందులో ఉంచిన సుమారు 497 బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.హడావుడిలో దొంగలు ఆ గ్యాస్ కట్టర్‌ను అక్కడికక్కడే వదిలేశారు.మరుసటి రోజు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు బ్యాంకు వద్దకు చేరుకోగా చోరీ జరిగిన విషయం తెలిసిందన్నారు.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.

Telugu Bank Robbery, Gold Robbed, Gold Robbery, Massive Theft, Bank India, Telan

ఘటనాస్థలికి చేరుకున్న డీసీపీ రాజమహేంద్రనాయక్‌ బృందం పరిశీలించారు.అలాగే చోరీ వార్త తెలియగానే బ్యాంకు ఖాతాదారులు కూడా హడావుడిగా అక్కడికి చేరుకున్నారు.ఆ తర్వాత పోలీసులు అధికారులను ఆభరణాల విషయంపై ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

చోరీకి గురయిన నగలను గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు.రెండేళ్ల క్రితం కూడా ఈ బ్యాంకులో చోరీ జరిగింది.ఆ తర్వాత సెక్యూరిటీ గార్డును నియమించినా గత ఏడాది కాలంగా ఆ పోస్టు ఖాళీగా ఉంది.దింతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube