చాలామంది టి20లు మొదలైనప్పటి నుంచి ఒక ఇన్నింగ్స్ లో 300 పరుగులు కొట్టగలరన్న మాటలను నిజం చేస్తూ తాజాగా ఢిల్లీ లీగ్ లో ఢిల్లీ సూపర్ స్టార్ టీం రుజువు చేసింది.అవును తాజాగా జరిగిన ఢిల్లీ t20 లీగ్ లో నార్త్ ఢిల్లీ స్ట్రైయికర్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్( south delhi superstar), నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 308 పరుగులు చేసి ఔరా అనేలా చేశారు.
ఇక ఈ మ్యాచ్ సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ జట్టు ఓపెనర్ గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య( Priyansh Arya ) ఆకాశమే హద్దుగా చెలరేగారు.కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో 120 పరుగుల సునామీ సృష్టించాడు.ఇకపోతే ప్రియాన్ష్ ఈ ఇన్నింగ్స్‌లో ఓకే ఓవర్ లో 6కి ఆరు సిక్సర్లు కూడా భాదాడు.
మానన్ భరద్వాజ్ వేసిన ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6.ఆరుకి ఆరు సిక్సర్లు బాది భారీ స్కోరుకు అడుగులు వేశాడు ప్రియాన్ష్ ఆర్య.
ఇక మరోకవైపు ఓపెనర్ సార్థక్ రాయ్ 11 పరుగులు చేసి అవుట్ అయినా.కెప్టెన్ ఆయుష్ బదోనీ) ,Ayush Badoni_ మాత్రం 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్సర్ల దెబ్బకి 165 పరుగులు చేశాడు.దీంతో డిల్లి ఇంత భారీ స్కోరును నమోదుచేసింది.ఇక ఈ మ్యాచ్ లో ఆయుష్ బదోని నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లపై చేసిన విధ్వంసంలో 19 సిక్సర్లతో కొట్టి టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
అలాగే, ఈ మ్యాచ్ లో 165 పరుగులు సాధించడం ద్వారా భారతదేశం తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డును సృష్టించాడు.