ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో( Gudlavalleru Engineering College ) రహస్య కెమెరాల వ్యవహారం గురించి అందరికి తెలిసిన విషయమే.కాలేజీలో విద్యార్థుల వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు( Secret Cameras ) నుంచి వీడియోలను తీస్తున్నారని అనేక ఆరోపణలను విద్యార్థులు చేశారు.
ఈ క్రమంలో విద్యార్థులు అందరూ కలిసి కాలేజీ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి.ఈ క్రమంలో ఈ సంఘటనపై విచారణకు పోలీసులలో రంగంలోకి దింపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఎప్పటికప్పుడు విచారణకు సంబంధించిన వివరాలను తెలుసుకొని పరిశీలన చేపట్టారు.
ఈ క్రమంలో ఈ సంఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించడం జరిగింది.ఆమె నైతికంలో వేగవంతంగా కొనసాగుతున్న విచారణ, మరోవైపు కాలేజీ వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుండి మహిళా పోలీస్ అధికారులను కూడా ఆ ప్రాంతానికి రప్పించారు.
అయితే కోడూరు నుంచి ఎస్ఐ శిరీషను( SI Sirisha ) ఇక్కడ బందోబస్తుగా విధులకు నియమించగా, ఆమె ఒక సమయంలో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.అయితే ఈ సంఘటనపై ఆ పోలీస్ అధికారి తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఎస్ఐ శిరీష ప్రవర్తన సరికాదు అంటూ ఆమె వ్యవహారిక తీరు పై అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు.
తీవ్ర విషాదంలో ఉన్న విద్యార్థులను ఊరట కల్పించాల్సింది పోయి వారిపై తురుచుగా అధికారులు ఇలా ప్రవర్తించడం సరికాదు అంటూ చంద్రబాబు స్పష్టంగా తెలియజేశారు.ఈ క్రమంలో అధికారులు ఎస్ఐ శిరీష దర్యాప్తు బృందంలో లేరని ఆమె కేవలం అక్కడ బందోబస్తుకి కోసమే పిలిపించాము అంటూ సీఎంకు వివరణ ఇచ్చారు.అయితే మరోవైపు శిరీష దురుసు ప్రవర్తనకు శిక్షగా అక్కడ విధుల నుంచి వెంటనే ఆమెను తప్పించినట్లు తెలియజేశారు.
అంతేకాకుండా ఈ సంఘటనపై ఎస్సై నుంచి వివరాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంతో తెలియజేశారు.