ప్రముఖ కన్నడ నటులలో ఒకరైన దర్శన్( Darshan ) సొంత తప్పిదాలతో కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు.రేణుక స్వామి( Renuka Swamy ) హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఆయన పరప్పన ఆగ్రహం జైల్లో( Parappana Agrahara Jail ) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనను మరో జైలుకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో ఆయన ఇక నుంచి తన కుటుంబాన్ని కలవడం మరింత కష్టం కానుంది.అగ్రహారంలో ఆయనకు రాజ మర్యాదలు అందుతున్నట్లుగా స్పష్టంగా రుజువు కావడంతో.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి పరమేశ్వర్ నటుడు దర్శన్ మరొక జైలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీంతో నటుడు దర్శన్ ను అగ్రహారం జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు( Bellary Central Jail ) తరలించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.ఇకపోతే ఈ కేసులో అని నిందితులైన దర్శన్ తో పాటు.మరికొంతమంది నిందితుల్ని వేరువేరు జైలుకు తరలించారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా అందాయి.కోర్టు ఆదేశాల మేరకు నిందితులను బదిలీ చేయాలని చీప్ సూపరెండెంట్ తరలింపు ప్రక్రియను మొదలుపెట్టారు.
ఇకపోతే., ప్రధాన నిందితులు దర్శన్ ను కోర్టు విచారణల భాగంగా బళ్లారి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యే విధంగా వ్యవస్థ కూడా అక్కడ ఉంది.ఈ కేసులో నిందితులైన దర్శన్ ను బళ్లారి జైలుకు.
, సందీశ్, రాఘవేంద్ర, పవన్ లను మైసూర్ జైలుకు తరలించనున్నారు అధికారులు.అలాగే ధనరాజ్ ను ధార్వాడ జైలుకు, జగదీష్ ను షిమోగా జైలుకు, వినయ్ ని విజయపుర జైలుకు, నాగరాజ్ ను కలబురిగి జైలుకు, ప్రదుష్ ను బెల్గాం జైలుకు, లక్ష్మణ్ ను షిమోగా జైలుకు అధికారులు తరలించారు.
ఇక కేసులో మరో నిందితులు పవిత్ర గౌడ్, అను కుమార్ దీపక్ వరప్ప లు అగ్రహారం జైల్లోనే ఉండనున్నారు.