తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీకి పరిస్థితులన్ని ప్రతికూలంగానే మారాయి.పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరిపోగా ఇంకా అనేకమంది ఆ బాటలోనే వెళ్లేందుకు సిద్ధమవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అరెస్టు కావడం ఇప్పటికీ ఆమెకు బెయిల్ లభించకపోవడం, ఆమె అనారోగ్యానికి గురికావడం ఇవన్నీ బిఆర్ఏస్ అగ్ర నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.కవితకు బెయిల్ తీసుకొచ్చేందుకు కేటీఆర్,( KTR ) హరీష్ రావులు( Harish Rao ) ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఢిల్లీకి( Delhi ) వెళ్లి కొంతమంది కీలక నేతలతో పాటు, న్యాయ నిపుణులతో నూ సంప్రదింపులు చేస్తూనే వస్తున్నారు.తాజాగా మరోసారి కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు.మంగళవారం లిక్కర్ స్కాంలో అరెస్ట్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఢిల్లీకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారింది.ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీనియర్ నేతలతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు.ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను
ఎందుకు వెంట తీసుకువెళ్లారు అనేది చర్చనీయాంశంగా.మారింది.ఈసారి తప్పకుండా కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావంతో ఉంది .బెయిల్ వచ్చినా రాకపోయినా 20 మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులతో ఢిల్లీకి కేటీఆర్ వెళ్తుండడం వెనక కారణాలు చాలానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .కోర్టు కవితకు బెయిల్ తిరస్కరిస్తే ఈడి , సిబిఐ కార్యాలయ ల వద్ద బీఆర్ఎస్ ధర్నాలు చేసేందుకే 20 మంది ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచర గణాన్ని వెంటేసుకుని కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.