యూకేలో( UK ) దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన వృద్ధురాలిని ఓ యువకుడు కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపాడు.
నార్త్ వెస్ట్ లండన్‌లోని ఓ బస్టాప్ వద్ద వేచి వున్న 66 ఏళ్ల బాధిత మహిళను 22 ఏళ్ల యువకుడు హత్య చేశాడు.ఈ కేసులో భాగంగా అతనిపై అభియోగాలు మోపి రిమాండ్‌కు తరలించారు.
బాధితురాలిని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)లో( National Health Service ) మెడికల్ సెక్రటరీగా పనిచేసిన అనితా ముఖేగా( Anita Mukhey ) గుర్తించారు.ఆమె గత వారం లండన్‌లోని ఎడ్గ్‌వేర్ ప్రాంతంలో బర్ట్న్ ఓక్ బ్రాడ్‌వే బస్ స్టాప్( Burnt Oak Broadway Bus Stop ) వద్ద వేచి ఉండగా.
నిందితుడు జలాల్ డెబెల్లా( Jalal Debella ) కత్తితో ఆమె మెడ, ఛాతీపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
ఈ నేరానికి గాను పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని లండన్‌లోని( London ) ఓల్డ్ బెయిలీ కోర్టులో హాజరుపరిచాడు.ఆగస్టులో ఈ కేసులో తదుపరి విచారణ జరగనుంది.మే 9 గురువారం ఉదయం 11.50 గంటలకు బర్న్ట్ ఓక్ బ్రాడ్‌వేలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.దీంతో అధికారులు , లండన్ అంబులెన్స్ సర్వీస్ (ఎల్ఏఎస్) , లండన్ ఎయిర్ అంబులెన్స్ (హెచ్‌ఈఎంఎస్) అంతా ఘటనాస్థలికి చేరుకున్నారు.
తీవ్రగాయాలతో పడివున్న అనితకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.అయినప్పటికీ ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది.
మే 9న ఉత్తర లండన్‌లోని కొలిండేల్ ప్రాంతంలో హత్యకు పాల్పడిన అనుమానంతో డెబెల్లాను అరెస్ట్ చేశారు.అనితను హత్య చేయడం, ప్రమాదకర ఆయుధాన్ని కలిగిఉండటం వంటి అభియోగాలను అతనిపై మోపారు.ఛాతీ, మెడ ముందు భాగంలో తీవ్రమైన గాయాలు కావడమే మరణానికి ప్రాథమిక కారణంగా క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) కోర్టుకు తెలిపింది.నివేదికల ప్రకారం.నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో జనం షాక్‌కు గురయ్యారు.