నటుడు మహర్షి రాఘవను( Maharshi Raghava ) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సన్మానించారు.ఆయన గొప్ప మనసును మెచ్చుకున్నారు.
రక్తదానం( Blood Donation ) విషయంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రేరణగా తీసుకోవాలని చిరు కోరారు.మహర్షి రాఘవ ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా వందసార్లు మా బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు.
ఒక వ్యక్తి అన్నిసార్లు రక్తం ఇవ్వడం ఇదే ప్రథమం.ఈ సందర్భంగా ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించి సన్మానించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
నిజంగా ఆయన చాలా గ్రేట్.
మేం బ్లడ్‌బ్యాంక్ స్థాపించినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్. అదే రోజు కార్యక్రమంలో పాల్గొన్న రాఘవ నాటి నుంచి ఇప్పటి వరకూ ఆదర్శ రక్తదాతగా నిలిచారు.ఆయన చేస్తున్న ఈ పని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను.
ఇలాంటి దాతల వల్లే ఎంతో మందికి సమయానికి రక్తం అందుతుంది అంటూ పొగడ్తలతో ముంచేత్తారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే మురళీ మోహన్( Murali Mohan ) సైతం రాఘవను ప్రశంసించారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నీలాంటి వాళ్ళని చాలామంది ఇన్స్పైర్ గా తీసుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.బోలా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమా విశ్వంభర.
( Vishwambhara ) త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సోషియో ఫాంటసీ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.