అమెరికా : ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ‘911’ సేవలకు అంతరాయం.. లాస్‌వెగాస్‌లో పునరుద్ధరణ

అమెరికాలోని పలు ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం ప్రజలు వినియోగించే ‘‘ 911 ’’ సేవలు నిలిచిపోయాయి.ప్రధానంగా లాస్ వెగాస్( Las Vegas ) లోయ అంతటా 911 సేవల్లో అంతరాయం ఏర్పడినట్లుగా బుధవారం సాయంత్రం ప్రజలు సామాజిక మాధ్యమాల్లో నివేదించారు.

 911 Outage Reported Across Us States Services Restored In Las Vegas Details, 911-TeluguStop.com

లాస్‌వెగాస్‌తో పాటు సౌత్ డకోటా, నెవాడా, నెబ్రాస్కాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ సేవలకు అంతరాయం కలిగినట్లుగా సమాచారం.దీనిపై స్పందించిన అధికారులు, సాంకేతిక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి 911 సేవలను( 911 Services ) పునరుద్ధరించినట్లు లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

అంతరాయం చోటు చేసుకున్న సమయంలో కాల్ చేసిన వ్యక్తులందరిని సంప్రదించి వారికి సహాయం అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు.నాన్ ఎమర్జెన్సీ కాల్స్‌ కూడా పనిచేస్తున్నాయని.

ఎప్పటిలాగే అత్యవసర సమయాల్లో 911కి కాల్ చేయవచ్చని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

Telugu Outage, Restored, Dundycounty, Las Vegas, Nebraska, Nevada, Dakota, Dakot

మరోవైపు.సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సౌత్ డకోటా పబ్లిక్ సేఫ్టీ విభాగం( South Dakota’s Department of Public Safety ) తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా 911 సర్వీసులకు అంతరాయం కలిగినట్లు గుర్తించామని.

మీ ప్రాంతాల్లో ఈ సేవలు పనిచేయని పక్షంలో స్థానిక పోలీస్, కౌంటీ షరీఫ్ కార్యాలయాలు, నాన్ ఎమర్జెన్సీ లైన్‌ని ఉపయోగించి సహాయం పొందవచ్చని పోలీస్ అధికారులు వెల్లడించారు.సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు చెప్పారు.

Telugu Outage, Restored, Dundycounty, Las Vegas, Nebraska, Nevada, Dakota, Dakot

నెబ్రాస్కాలోని డూండీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం( DUNDY County Sheriff’s Office ) కూడా 911 సేవలకు అంతరాయం కలిగిన విషయంపై స్పందించింది.డూండీ కౌంటీ పరిసర ప్రాంతాల్లో 911 సేవలు ప్రస్తుతం నిలిచిపోయాయని.911కి కాల్ చేస్తున్నప్పుటు ప్రజలు బిజీ సిగ్నల్స్‌ను అందుకుంటున్నారని తెలిపింది.నెబ్రాస్కా రాష్ట్రంలో 911 సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని.

ఏదైనా అత్యవసర పరిస్ధితులు తలెత్తితే 308-423-2993 నెంబర్‌లకు కాల్ చేయాలని డూండీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.డెల్ రియో, కిల్‌గోర్‌తో పాటు టెక్సాస్‌లోని వివిధ నగరాల్లోనూ 911 సేవలకు అంతరాయాలు ఏర్పడినట్లుగా కథనాలు వస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube