విపక్ష నేతలు చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు సంస్కార హీనులన్న ఆయన సీఎం జగన్ పై దాడిని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ నిర్వహించే ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మంత్రి జోగి రమేశ్( Minister Jogi Ramesh ) ఆరోపించారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలకు ప్రజలు రావడం లేదని విమర్శించారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయారన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కానీ, పవన్ కల్యాణ్ కు కానీ దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.ఎన్నికల ఫలితాల తరువాత ఇద్దరూ హైదరాబాద్ పారిపోతారన్న మంత్రి జోగి రమేశ్ జూన్ 4 తరువాత టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.
అనంతరం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.పవన్ కు దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.







