భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది కెనడా.( Canada ) ప్రస్తుతం మనదేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం నెలకొన్న నేపథ్యంలో తమ పౌరులు భారత్‌లో( India ) అప్రమత్తంగా వుండాలంటూ కెనడా ట్రావెల్ అడ్వైజరీ( Travel Advisory ) జారీ చేసింది.
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బలప్రదర్శనలు జరిగే అవకాశం వున్నందున తమ పౌరులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది.భారత్‌లో సంచరించే సమయంలో కెనడియన్లు అధిక స్థాయి జాగ్రత్తలు పాటించాలని బుధవారం ఓ ప్రకటన చేసింది.
భారత్‌లో పార్లమెంటరీ ఎన్నికలు( Parliament Elections ) ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య జరగాల్సి వుందని.ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత బలప్రదర్శనలు జరగవచ్చని కెనడా హెచ్చరించింది.
ఈ ప్రక్రియలో ట్రాఫిక్, ప్రజారవాణాకు అంతరాయం కలిగిస్తాయని.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కర్ఫ్యూలు విధించవచ్చని ఆ దేశం పేర్కొంది.
భారత్‌లో భారీ ప్రదర్శనలు, సమావేశాలు జరిగే ప్రాంతాలకు దూరంగా వుండాలని కెనడియన్లను హెచ్చరించింది.

కాగా… ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా .కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

తాజాగా నిజ్జర్ హత్యపై ట్రూడో మరోసారి స్పందించారు.ఈ ఘటనపై న్యూఢిల్లీతో నిర్మాణాత్మకంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రూడో వెల్లడించారు.బుధవారం వాంకోవర్‌లో మీడియాతో మాట్లాడుతూ .కెనడియన్లు ఎవరూ మరోసారి ప్రమాదానికి గురికాకుండా చర్యలు చేపడతామన్నారు.నిజ్జర్ హత్యపై ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు ఎలాంటి అరెస్ట్‌లు కానీ , ఆధారాలు కానీ లభించలేదు.గతేడాది జూన్ 18న సర్రేలోని గురుద్వారా పార్కింగ్ ప్లేస్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ముసుగులు ధరించిన దుండగులు కాల్చి చంపారు.








