నల్లగొండ జిల్లా: టాలీవుడ్‌లో తీవ్ర విషాదంనెలకొంది.తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమా( Daasi movie )కు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్ (73) మరణించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్( Sudarshan ) వృత్తి రీత్య నాగార్జున్ సాగర్( Nagarjuna Sagar )లోని హిల్ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేసేవారు.
ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిపలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు.సుదర్శన్ ( Sudarshan ) అంత్యక్రియలు ఈవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు
.