భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి.అయితే అనాదిగా జరుపుకునే ప్రతి పండుగలో( Festivals ) కచ్చితంగా పూజ ఉంటుంది.
కానీ కాలంలో ఏదో ఒక సైన్స్ ఉంటుందనే విషయం నమ్మం.కానీ ఇది మాత్రం నిజం.
ఇప్పటికే కొన్ని పండుగలు వాటి వెనుక ఉండే సైన్స్ విషయాలను శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించడం జరిగింది.తెలుగు పంచాంగం ప్రకారం కొద్ది రోజుల్లో శిశిర రుతువు పూర్తయి వసంత రుతువు ప్రారంభమవుతుంది.
ఫాల్గుణ అంటే తెలుగు మాసాలలో చివరి నెల.ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండుగ( Holi Festival ) జరుపుకుంటారు.ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులకు ప్రతీకగా ఈ పండుగను అభివర్ణించవచ్చు.హోలీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది.ఇది సామాజికమైన పండుగ.ఇందులో పిండి వంటలు చేయడం, దేవతలను పూజించడం ఏది ఉండదు.
గుప్పెడు రంగులను తీసుకొని గుండె నిండా నింపుకొని ఇరుగుపొరుగు వాళ్లతో సంతోషాలను పంచుకునే పండుగే హోలీ పండుగ.అయితే హోలీ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.కానీ వాటిలో ముఖ్యమైనది ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది హోలీని హోలీకా దహనం అని అంటారు.ఎందుకంటే హిరణ్యకశిపుడు( Hiranyakashyapa ) నేలమీద కానీ, నింగిలో కానీ, ఇంట గాని, బయట గాని, రాత్రి గాని, పగలు కానీ, మనిషి చేతకాని, పశువు చేతకాని, ఆయుధాలతో కానీ తనకు మరణం సంభవించకూడదని వరం తీసుకుంటాడు.హిరణ్యకశిపుడు విష్ణుద్వేషీకగా అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి ( Vishnu Murthy ) పరమ భక్తుడు.
ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాలుగా మార్చాలని ప్రయత్నిస్తాడు.
అన్ని విధాల విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణ దండన విధిస్తాడు.హిరణ్యకశిపునికి హోలీకా అనే చెల్లెలు కూడా ఉండేది.ఆమెను అగ్ని దహింప చేయాలనే ఓ వరం కూడా ఉంది.
హోలీక ప్రహ్లాదున్ని మమకారంతో తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు నటించగానే వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు.కానీ ఇతరులకు హాని తలపెడితే హోలీకకు ఉన్న వరం పని చేయదనే విషయాన్ని మర్చిపోయారు.
దీంతో హోలీకవరం బెడిసికొట్టి ఆమె అగ్నికి ఆహుతి అయిపోయింది.హోళికా దహనం పేరట జరుపుకునే ఆ పండుగే హోలీ.
DEVOTIONAL