Chilli Crop : మిరప పంటకు తీవ్రనష్టం కలిగించే నారుకుళ్లు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

రైతులు మిరప పంటను( Chilli crop ) ఎర్ర బంగారంగా పిలుచుకుంటారు.మిరప పంట సాగు విధానంపై అవగాహన ఉంటే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural experts ) చెబుతున్నారు.

 Methods To Prevent The Pests That Cause Serious Damage To The Pepper Crop-TeluguStop.com

పంట సాగు విధానంపై అవగాహన లేకపోతే చీడపీడలు లేదా తెగులు పంటను ఆశిస్తే వాటిని గుర్తించి నివారించడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.అలా ఆలస్యం అయితే కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టం ఎదుర్కోవలసి వస్తుంది.

మిరప పంటను సాగు చేసే నేలలో పోషకాల శాతాన్ని పెంచుకోవాలంటే ముందుగా పచ్చిరొట్ట పైరు అయిన మినుము పంటను వేసి కలియదున్నాలి.ఆ తర్వాత ట్రాక్టర్ కల్టివేటర్ తో నేలను మెత్తగా దుక్కి చేయాలి.

దీంతో పెద్దగా రసాయన ఎరువుల ఉపయోగం ఉండదు.

Telugu Agricultural, Chilli Crop, Copper, Methodsdamage, Pendimethalin, Ridomil

ప్రధాన పొలంలో నాటుకునే మిరప నారు వయసు కనీసం 35 నుంచి 40 రోజుల మధ్య ఉండాలి.చీడపీడలు, తెగుళ్లు సోకని ఆరోగ్యకరమైన నారును మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి.మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

మిరప నాటిన 20 రోజుల తర్వాత అంతర కృషి ద్వారా కలుపు తొలగించాలి.ప్రధాన పొలంలో మిరప మొక్కలు నాటుకునే రెండు రోజుల ముందు 1.5మి.లీ పెండిమిథలిన్( Pendimethalin ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Telugu Agricultural, Chilli Crop, Copper, Methodsdamage, Pendimethalin, Ridomil

మిరప పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో నారు కుళ్ళు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగుళ్ళను సకాలంలో గుర్తించి తొలి దశలోనే రసాయన పిచికారి మందులు ఉపయోగించి పూర్తిగా నివారించాలి.మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) లేదంటే రెండు గ్రాముల రిడోమిల్ MZ( Ridomil MZ ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.మిరప పంటను సాగు చేయాలి అనుకునే రైతులు ముందుగా మిరప పంటకు ఎలాంటి చీడపీడలు ఏఏ సందర్భాల్లో ఆశిస్తాయి.

ఎలాంటి తెగుళ్లు ఏఏ సందర్భాల్లో ఆశిస్తాయి అనే విషయాల పట్ల అవగాహన కల్పించుకోవాలి.అప్పుడే పంటను చీడపీడల, తెగుల భారి నుండి సంరక్షించుకుని అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube