తెలుగు ప్రేక్షకులకు హీరో తేజా సజ్జా ( Teja Sajja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించాడు.
బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజా.ఇక ఆ తర్వాత హీరోగా మారి జాంబిరెడ్డి ( Zombie Reddy )అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపుని ఏర్పరచుకున్న తేజ తాజాగా హనుమాన్( Hanuman ) మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసి గర్వించదగ్గ సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ను సాధించింది.ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరో తేజాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.అదేమిటంటే.హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయలలోపే పారితోషికం తీసుకున్నాడట.కానీ హనుమాన్ సినిమా రూ.300 కోట్ల క్లబ్లో చేరడంతో తేజాకు భారీగా డిమాండ్ పెరిగింది.దాంతో తేజాతో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే తేజా రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తోంది.ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ.అయితే ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.