హిందువులలో ఎంతోమంది ఆంజనేయ స్వామిని( Anjaneya Swamy ) ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే.ఆంజనేయస్వామి కోరిన కోర్కెలను తీరుస్తాడని చాలామంది ఫీలవుతారు.
ప్రతి ఊరిలో దాదాపుగా హనుమంతునికి ఆలయం( Hanuman Temple ) ఉంటుంది.హనుమంతుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని చాలామంది ఫీలవుతారు.
అయితే ఒక ఆలయంలో హనుమంతుడిని పూజిస్తే క్యాన్సర్( Cancer ) తగ్గుతుందని అభిమానులు విశ్వసిస్తారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దండ్రువా ధామ్( Dandraua Dham Temple ) పేరుతో ఉన్న ఆంజనేయుని ఆలయం ఎంతో పాపులర్ కాగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని ఫీలవుతారు.హనుమంతుని పాదాల దగ్గర నీళ్లు తాగితే క్యాన్సర్, ఇతర ప్రమాదరమైన వ్యాధులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు.

రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులభంగా ఈ ఆలయాన్ని చేరుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఐదు మంగళవారాల పాటు ఇక్కడ హనుమంతుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు దక్కుతాయని చాలామంది ఫీలవుతారు.కొంతమంది ఈ ఆలయాన్ని హనుమాన్ క్లినిక్( Hanuman Clinic ) అని పిలుస్తారు.ఈ హనుమంతుడిని పూజించడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తారు.ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేస్తాడని అలా వ్యాధులు తగ్గుతాయని బలమైన నమ్మకం ఉంది.

మొండి వ్యాధులతో తరచూ బాధ పడేవాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు.భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని దేవుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.తక్కువ ఖర్చుతోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఆలయానికి దర్శనానికి వెళ్లే వాళ్లు ఈ ఆలయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ప్రయాణం చేస్తే మంచిది.