పుత్రదా ఏకాదశి.. అందరూ ఆరోజు ఏమి చేయాలంటే..?

హిందూ క్యాలెండర్( Hindu Calendar ) ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశిలో ఉంటాయి.ఈ ఏకాదశిలో పుత్రదా ఏకాదశి( Putrada Ekadashi ) చాలా ప్రత్యేకత కలిగి ఉంది.

 Putrada Ekadashi What Should Everyone Do On That Day , Putrada Ekadashi, Hindu C-TeluguStop.com

దీనిని పుష్య మాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున అంటే జనవరి 21వ రోజున జరుపుకుంటారు.ఇక సంతానం లేని దంపతులు ఏకాదశి రోజున వ్రతం చేస్తే పిల్లలు పుడతారని నమ్ముతారు.

పుత్రదా ఏకాదశి జనవరి 20 సాయంత్రం 7:42 గంటలకు ప్రారంభమై జనవరి 21 సాయంత్రం 7:26 గంటలకు ముగిస్తుంది.హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిధిని ఉదయం లెక్కిస్తారు.

అందుకే జనవరి 21వ తేదీన ఆదివారం పుత్రదా ఏకాదశి జరుపుకోవాలని పండితులు చెప్పారు.ఈ ఏకాదశి ఉపవాసాలలో అత్యంత ముఖ్యమైనది.

Telugu Betel Leaf, Bhakti, Coconut, Devotional, Flowers, Guava, Hindu Calendar,

ఏకాదశి రోజున క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం వలన మనసులోని చంచలత్వం తొలగిపోయి, ఐశ్వర్యం, ఆరోగ్యం( Wealth , health ) లభిస్తుంది.అలాగే మానసిక ఆరోగ్యం లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.పుష్య పుత్రదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు.విశ్వాసాల ప్రకారం ఆ రోజున ఉపవాసం ఉంటే జీవితాంతం ఆనందాన్ని పొందుతారు.ఉపవాసం ఉన్న స్త్రీ లేదా పురుషుడు, స్వీయ నియంత్రణ అలాగే బ్రహ్మచర్యం పాటించాలి.అలాగే మరుసటి రోజు ఉపవాసం ప్రారంభించడానికి ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి విష్ణువుని ( Vishnu )ధ్యానించాలి.

ఆ తర్వాత గంగాజలం, తులసి ఆకులు, పుష్పాలు, పంచామృతాలతో విష్ణువును పూజించాలి.

Telugu Betel Leaf, Bhakti, Coconut, Devotional, Flowers, Guava, Hindu Calendar,

పుత్రదా ఏకాదశి వ్రతం పాటించే స్త్రీలు లేదా పురుషులు నిర్జల వ్రతం చేయాలి.ఇక సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఆ రోజున వ్రతం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.అయితే విష్ణు విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్టించి దాని ముందు కలశాన్ని ఉంచి దానికి ఎర్రటి వస్త్రం చుట్టాలి.

ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువు పూజించాలి.పూజలో పూలు, కొబ్బరికాయ, తమలపాకు, లవంగం, జామకాయ లాంటివి ఉంచాలి.అలాగే పండ్లు, మిఠాయిలు నైవేద్యం పెట్టాలి.అలాగే ఆరోజు జాగరణ కూడా చేయాలి.

ఆ తర్వాత పుత్రదా ఏకాదశి కథ చదివి, హారతి ఇవ్వాలి.ఇలా చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube