ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.ఏడాది కాలంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే రేయింబవళ్లు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లాలోని కుత్తుం గ్రామానికి చెందిన శివంగి పరశురామ్( Shivangi Parashuram ) నిరుపేద కుటుంబానికి చెందినవారు.పరశురామ్ తండ్రి గవరయ్య కర్రమిల్లు కార్మికుడుగా పని చేస్తుండగా తల్లి కూలీగా పని చేస్తున్నారు.
ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కాగా కూతురికి ఇప్పటికే పెళ్లైంది.పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించిన పరశురామ్ ఇంటర్ లో 976 మార్కులు సాధించడం గమనార్హం.విశాఖలోని అనిట్స్ లో పరశురామ్ బీటెక్ పూర్తి చేశారు.
గత ఏడాది కాలంలో పరశురామ్ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.ఎస్.
ఎస్.సీ సీజీఎల్( S.S.C CGL ) పరీక్ష రాసి పరశురామ్ ప్రివెంటివ్ ఆఫీసర్ కస్టమ్స్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం సాధించారు.
ఎస్.ఎస్.సీ సీజీఎల్ 2022లో పరశురామ్ రాజమండ్రి డివిజన్ లో పోస్టల్ అసిస్టెంట్( Postal Assistant ) జాబ్ కు ఎంపికయ్యారు.గతేడాది పరశురామ్ ఈపీడీఎఫ్వో 2023లో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్ కు ఎంపిక కావడం గమనార్హం.
తన సక్సెస్ గురించి పరశురామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పేరెంట్స్ కష్టం వృథా కాకూడదని భావించి నేను ఎంతో కష్టపడి చదివానని పరశురామ్ అన్నారు.
నా పేదరికమే( Poverty ) నన్ను నిరంతరం ముందుకు నడిపించిందని పరశురామ్ కామెంట్లు చేశారు.ఈ నెల 29వ తేదీన ప్రివెంటివ్ ఆఫీసర్ జాబ్ లో జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నానని పరశురామ్ వెల్లడించారు.పరశురామ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండగా పరశురామ్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.పరశురామ్ కు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.