మెగా డాటర్ నిహారిక ( Niharika ) భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని తనకు నచ్చిన విధంగా గడుపుతూ ఉన్నారు.ఇలా విడాకులు తీసుకున్న అనంతరం ఈమె ఏ మాత్రం ఇండియాలో లేకుండా తరచు తరపున వచ్చిన ప్రదేశాలకు వెళ్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు.
ఒకవైపు వృత్తిపరమైనటువంటి జీవితంలో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా ఈమె ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే నిహారిక గత కొంతకాలంగా వెకేషన్ లో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈమె థాయిలాండ్ వెకేషన్ వెళ్లారు.
సాధారణంగా థాయిలాండ్( Thailand ) వెకేషన్ వెళ్ళిన వారు సరదాగా బీచ్ లో వెంట వారికి నచ్చిన ఫుడ్ తింటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతారు కానీ నిహారిక మాత్రం అడవుల వెంట పయనమయ్యారు.
నిహారిక వంటరిగా మిట్ట మధ్యాహ్నం అడవులలో తిరుగుతూ తనకు నచ్చినటువంటి ప్రదేశాలలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఇలా ఈమె అడవులలో తిరుగుతూ ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అడవులలో ఏనుగులకు స్నానాలు చేయించడం వాటికి ఫుడ్ పెట్టడం వంటివి చేస్తున్నారు.
ఇక నిహారిక కూడా అడవులలో( Forest ) దొరికే కూరగాయలు దుంపలను అక్కడే వంట చేసుకుని మరి తింటున్నారు.వెదురు బొంగులలో ఈమె వంట తయారు చేసుకుని తినడం అటవీ అందాలను ఆస్వాదిస్తూ ఇలా అడవులలో తిరుగుతూ ఉండడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలను చూసిన వారందరూ కూడా ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు థాయిలాండ్ వెళ్లినటువంటి వారు ఎంచక్కా బీచ్ కి వెళ్లి వారికి నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ నువ్వేంటి నిహారిక ఇలా ఒంటరిగా అడవులలోకి వెళ్లిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈమె అడవులలో జలపాతాలను వీక్షించడమే కాకుండా స్వయంగా అడవులలో లభించే కూరగాయలతో వంట చేస్తూ ఆ వంటను ఆస్వాదిస్తూ ఉన్నారు.ఏది ఏమైనా నిహారిక మాత్రం ఇటీవల కాలంలో తరచూ వెకేషన్ లకు వెళ్తూ తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని గడుపుతున్నారు.ఇక ఈమె వృత్తిపరమైనటువంటి జీవితానికి వస్తే… ఈమె పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ స్థాపించడమే కాకుండా ఇప్పటికే ఈ బ్యానర్లో పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.
అదేవిధంగా సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.ఇక ఈమె సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.