బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక జైన్ ( Priyanka Jain ) ఒకరు.ఈమె మౌనరాగం జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా ఎంత మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లారు బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలు పాటు కొనసాగుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.
బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ప్రియాంక బయటకు వచ్చిన తర్వాత తరచూ ఈమె పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.అయితే ఒక వీడియో సందర్భంగా తన ప్రియుడు శివకుమార్ ( Shiva Kumar ) తో కలిసి ఈమె తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ ఏడాదిలోనే మా పెళ్లి జరుగుతుందని నా జుట్టు పెరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ ఈమె సమాధానం చెప్పారు.
అయితే తాజాగా ప్రియాంక సర్జరీ చేయించుకుంది అంటూ శివకుమార్ ఒక వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.
ఈ విధంగా ప్రియాంక సర్జరీ( Surgery ) చేయించుకుంది అంటూ ఈయన చెప్పడంతో ఏమైంది అంటూ అభిమానుల కంగారుపడుతున్నారు.అయితే ఆమెకి ఏడవ తరగతి నుంచి కూడా సైట్ ప్రాబ్లం ఉందని అందుకే ఎక్కువగా కళ్ళజోడుతోనే మనకు కనిపిస్తూ ఉంటుందని శివకుమార్ వెల్లడించారు.ఏదైనా ఫంక్షన్లప్పుడు లేదా షూటింగ్ సమయంలో లెన్స్ వాడుతుందని ఇలా తరచూ లెన్స్ పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా ఉంది అందుకే శాశ్వత పరిష్కారంగా చిన్న సర్జరీ చేస్తున్నాము అంటూ శివకుమార్ తెలిపారు.
తాను సర్జరీ( Eye Surgery ) చేయించుకుంటూ ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన ప్రియాంక కళ్ల కోసం చేయించుకుంటున్నటువంటి సర్జరీ గురించి తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.