తిరుమలలో క్యూలైన్ లో ఉన్నప్పుడు స్త్రీలకు నెలసరి వస్తే ఎలా..? దర్శనం చేసుకోవచ్చా..?

కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల, తిరుపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.ఇక్కడ శ్రీవారిని దర్శించుకునేందుకు( Tirumala Srivaru ) చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా అక్కడికి తరలి వస్తుంటారు.

 Can Women Have Darshan In Tirumala Queue Line If They Get Monthly Details, Women-TeluguStop.com

అయితే ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామివారి దర్శనానికి ఒక్కసారి 24 గంటల నుండి 48 గంటల వరకు సమయం పడుతూ ఉంటుంది.అయితే ఆ విధంగా క్యూ లైన్ లో వేచి చూస్తున్న సమయంలో స్త్రీలకు నెలసరి వస్తే ఏం చేయాలి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది.

తిరుపతిలో మాత్రమే కాకుండా సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నెలసరి( Periods ) వస్తే ఏం చేయాలి? అన్నది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది.అయితే సాధారణంగా ఇంటిలో అంటుముట్టు అంటూ నెలసరి సమయంలో పూజా కార్యక్రమాలకు మహిళలు( Women ) దూరంగా ఉంటారు.

అలాగే స్త్రీలు వెలుపల ఉన్న సమయంలో గుడికి వెళ్లకూడదు, దీపం పెట్టకూడదు, ముట్టుకోకూడదు అంటూ చెబుతూ ఉంటారు మన పెద్దలు.

Telugu Bhakti, Darshan, Devotional, Periods, Periods Temple, Tirumala, Tirumalaq

అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో దేవాలయాల్లోకి( Temples ) వెళ్లడానికి కూడా చాలామంది అపవిత్రమని భావిస్తూ ఉంటారు.కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా వెళ్లకూడదని చెబుతూ ఉంటారు.కానీ అదే గుడిలో ఉన్న సమయంలో కనుక నెలసరి వస్తే ఏం చేయాలి? దాని వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.నెలసరి అనేది ప్రతి స్త్రీకి సాధారణంగా వచ్చేదే.అయితే గుడిలో పీరియడ్స్ రావడం వలన ఎటువంటి దోషాలు కలగవని చెబుతున్నారు.

Telugu Bhakti, Darshan, Devotional, Periods, Periods Temple, Tirumala, Tirumalaq

దేవాలయాల్లో ఉన్న సమయంలో కనుక స్త్రీలకు పీరియడ్స్ వస్తే వెంటనే లోపల నుండి బయటకు వచ్చేయాలి.అలాగే దర్శనానికి వెళ్లకుండా, వెళ్లే వారిని ముట్టుకోకుండా వచ్చేయడమే సరైన మార్గం.అంతేకానీ దేవాలయంలో ఇలా జరిగింది ఏంటి అని బాధపడాల్సిన అవసరం లేదు.గుడిలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చాయి.ఇది పాపం, దోషం అనిపించడంతో ఏమైనా చెడు జరుగుతుంది ఏమోననే ఆలోచన కూడా అవసరం లేదు.ఎందుకంటే నెలసరి అనేది ప్రతి స్త్రీకి సాధారణమైన విషయమని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube