స్టేజ్ పై నాగచైతన్య మళ్లీ చిలిపినవ్వులు.. ఈసారి కృతిశెట్టితో అలా చేయడంతో?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.బంగార్రాజు సినిమా చైతన్య కెరీర్ కు ప్లస్ కాగా ఈ సినిమా ఈ వీకెండ్ నాటికి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుందని తెలుస్తోంది.

 Nagachaitanya Photo Goes Viral In Social Media Details, Naga Chaitanya, Krithi S-TeluguStop.com

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించడంతో ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపించారు.విడాకుల ప్రకటన తర్వాత చైతన్య సంతోషంగా ఉండటంతో పాటు బంగార్రాజు ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నారు.

అయితే నాగచైతన్యకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కొన్నిరోజుల క్రితం దక్ష కొంటె నవ్వులు నవ్వగా నాగచైతన్య సైతం నవ్వుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.

అయితే తాజాగా కృతిశెట్టితో చైతన్య స్టేజ్ కెమిస్ట్రీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.కృతిశెట్టి నవ్వుతుండగా చైతన్య కూడా నవ్వుతూ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం గమనార్హం.

చైతన్య చిలిపి నవ్వుల గురించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా నాగచైతన్య హీరోయిన్లను చూసి నవ్వుతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

Telugu Bangarraju, Chaitanya, Daksha Nagarkar, Krithi Shetty, Nagachaitanya, Nag

మరోవైపు నాగచైతన్య నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.వెబ్ సిరీస్ లకు కూడా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రయోగాత్మక పాత్రలకు తాను సిద్ధమేనని చెప్పకనే చెబుతుండటం గమనార్హం.

Telugu Bangarraju, Chaitanya, Daksha Nagarkar, Krithi Shetty, Nagachaitanya, Nag

బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.వీక్ డేస్ తో పోల్చి చూస్తే వీకెండ్ లో బంగార్రాజు మూవీ కలెక్షన్లు తగ్గిన నేపథ్యంలో ప్రమోషన్లలో స్పీడ్ పెంచితే బంగార్రాజు సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఆలస్యంగానే స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube